BIG BREAKING : AP TET ఫలితాలు విడుదల

AP TET

BIG BREAKING : ఏపీ TET ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఈ పరీక్షకు 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,48,427 మంది హాజరైనట్లు ఏపీ టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. మొత్తం 97,560 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ tet2dsc.apcfss.in ద్వారా హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు విద్యాశాఖ అభినందనలు తెలిపింది.