Visakhapatnam : నా కొడుకును వాడుకున్నారు..సాయితేజ కేసులో బిగ్ ట్విస్ట్!

Visakhapatnam

Visakhapatnam : విశాఖ డిగ్రీ స్టూడెంట్ సాయితేజ కేసు మరో మలుపు తిరిగింది. ఆరోపణలు ఎదురుకుంటున్న ఇద్దరు మహిళా లెక్చరర్లు తమకు సాయితేజ కొడుకు లాంటోడంటని చెప్పుకొచ్చారు. సరిగ్గా చదవడం లేదనే సాయితేజపై కఠినంగా ఉన్నామన్న లెక్చరర్లు వివరణ ఇచ్చారు.అయితే వాటని సాయితేజ ఫ్యామిలీ ఖండించారు.

మరోవైపు లైంగిక వేధింపుల వల్లే తన కొడుకు చనిపోయాడంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. టీచర్ భర్తకు ఏదో జబ్బు ఉందని… అందుకే తన కొడుకునే రమ్మని వేధించారని వాపోయింది. సాయితేజ మృతిపై కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు కుటుంబసభ్యులు, సన్నిహితులు. దీంతో అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది.

విశాఖపట్నం ఎంబీసీ కాలనీలో సమత డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సాయి తేజ. అక్టోబర్ 31 శుక్రవారం రోజున సాయితేజ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి తేజకు సరిగా మార్కులు వేయకపోవడం, రికార్డులు మళ్లీ మళ్లీ రాయిస్తూ ఇబ్బంది పెట్టడం, వ్యక్తిగత విషయాలపై సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు పంపడం వంటి వాటితో మానసికంగా ఒత్తిడికి గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మహిళా లెక్చరర్లు సాయితేజకు పంపినట్లుగా భావిస్తున్న కొన్ని వాట్సాప్ మెసేజ్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. “నేను చనిపోతే వస్తావా?”, “నువ్వు పిరికి” వంటి మానసిక ఒత్తిడికి గురిచేసేలా ఉన్న మెసేజ్‌లు అందులో ఉన్నాయి. పోలీసులు సాయితేజ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, లెక్చరర్‌తో జరిగిన వాట్సాప్ చాట్ వివరాలు, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మహిళా సిబ్బందిని కాలేజీ యాజమాన్యం తాత్కాలికంగా విధుల నుంచి సస్పెండ్ చేసింది.