Alluri case: అల్లూరు జిల్లాలో యువతి కిడ్నాప్ కేసుని రంపచోడవరం పోలీసులు చేదించారు. ఐదుగురు కిడ్నాపర్లను కటకటాలకు నెట్టి కథను సుఖంతం చేశారు. సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగిని సౌమ్యను సురక్షితంగా కాపాడి.. మెడికల్ టెస్ట్లకు ఆసుపత్రికి తరలించారు. యువతి పెళ్లికి నిరాకరించడంతో కిడ్నాప్ చేశారని విచారణలో తేల్చారు పోలీసులు. కిడ్నాప్ కు కశింకోట అనిల్ కుమార్ సహకరించిన నలుగురు స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు. సినీ ఫక్కీలో నిందితులను సిని తరహాలో చేస్ చేసి మరీ పట్టుకున్నారు. ఒరిస్సా-వై. రామవరం అటవీ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని రంపచోడవరం డిఎస్పి కార్యాలయానికి తీసుకొచ్చారు పోలీసు బృందాలు.
ఈ సందర్భంగా డీఎస్పీ సాయి ప్రశాంత్ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈనెల ఏడో తారీఖున దేవీపట్నం మండలం శరభవరం సచివాలయంలో విధుల్లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగిని సౌమ్యను కార్ లో కిడ్నాప్ చేసిన ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేసాము. కిడ్నాప్ కు పాల్పడిన యువకుడు అనిల్, సౌమ్య గతంలో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని చెప్తే సౌమ్య కుటుంబంలో తల్లిదండ్రులు ఒప్పుకొకపోవడంతో స్నేహితుల సహాయం కారుని అద్దెకు తీసుకుని కిడ్నాప్ తరహాలో సౌమ్యను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. నిందితులు ఇన్నోవా కార్లో బలవంతంగా తీసుకెళ్లిన వీడియో ఆధారంగా,ప్రత్యేక బృందాలతో గాలించాం. జగ్గంపేట సమీపంలో కిడ్నాప్ కు ఉపయోగించిన ఇన్నోవా కారు న వదిలేసి మరో కారు అద్దెకు తీసుకుని పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశారు..
నిందితుల్ని పట్టుకునేందుకు నాలుగు బృందాలను టెక్నికల్ ద్వారా, gps సిస్టం ద్వారా పట్టుకోవడం జరిగింది.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం కూడా గాలింపు జరుగుతుంది.. నిందితుడు కసింకోట అనిల్ కుమార్ పై ఇప్పటికే NDPS (గంజాయి )రెండు కేసులు, ఉండగా మరో ఐదు కేసులు ఉన్నాయి. నిందితులు మారేడుమిల్లి ,జగ్గంపేట, మండపేట, దేవీపట్నం,మండలాలకు చెందిన కసింకోట అనిల్ కుమార్, కళ్యాణ ఉమా మహేష్, రాగోలు దుర్గ విగ్నేష్, లతో పాటు, కిడ్నాప్ సమయంలో బాధితురాలు సమాచారం తెలియజేస్తూ సహకరించిన మాడే మణి మోహన్,పూసం పవన్ కుమార్ లను కూడా అరెస్టు చేశాం అని వెల్లడించారు.