BIG BREAKING : ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. కర్నూలు ఘటన మరువకముందే నెల్లూరులో ప్రమాదం జరిగింది. లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఐరన్ బారికేడ్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. నెల్లూరు జిల్లా పెళ్లకూరుమండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఐరన్ బారికేడ్ లేకపోతే బస్సు పల్టీ కొట్టే ప్రమాదం ఉండేది.
ఏపీలో మరో దారుణం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం.. స్పాట్ లో 36 మంది!#nellore #BusAccident #AndhraPradesh pic.twitter.com/NXjMbmiEOy
— kotlata (@kotlataweb) October 25, 2025
ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు 34మంది ప్రయాణికులున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులోని ప్రయాణికులను ఇతర వాహనాల్లో తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వరుస బస్సు ప్రమాదాలు జరగడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
మరోవైపు కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపద్యంలో నెల్లూరు రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. RTO మదానీ ఆధ్వర్యంలో పూలే బొమ్మ సెంటర్లో ప్రైవేట్ ట్రావెల్స్ ను అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా లేని రెండు బస్సులను సీజ్ చేశారు.
