Bus Accident : కర్నూలు జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచేలా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫిట్‌నెస్ లేని బస్సుతో ప్రయాణికులను కావేరి ట్రావెల్స్ బలితీసుకుంది. గాఢనిద్రలో ఉండగానే ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. బైక్‌ను ఢీకొట్టి 300 మీటర్లు ఈడ్చుకెళ్లి్ంది బస్సు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపుగా పైన స్లిపర్ లో పడుకున్న ప్రయాణికులే చనిపోయారు.
బస్సు ప్రమాదంలో బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్ మృతి చెందాడు. తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆతర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రమాద జరిగిన సమయానికి బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లతో కలిపి మొత్తం 43 మంది కాగా వారిలో 13 మంది ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు.
ఇక మరో 20 మంది మృతి చెందారు. మిగిలిన 9 మందికి సంబంధించిన ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ బస్సు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం మృతి చెందింది. గోళ్ల రమేష్ కుటుంబం మృతి చెందినట్లుగా బంధువులు వెల్లడించారు. గోళ్ల రమేశ్ (35), అనూష(30), శశాంక్ (12), మాన్యత (10) సజీవదహనం అయ్యారు. వీరిది వింజమూరు మండలం గోళ్లవారిపల్లి గ్రామస్తులు. బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50వేల తక్షణసాయం ప్రకటించారు.
ప్రయాణికులు వివరాలు
అశ్విన్‌రెడ్డి (36), జి.ధాత్రి(27), కీర్తి(30), పంకజ్(28), యువన్ శంకర్‌రాజు (22), తరుణ్(27), ఆకాశ్(31), గిరిరావు (48), బున సాయి(33), గణేశ్(30), జయంత్ పుష్వాహా (27), పిల్వామిన్ బేబి (64), కిశోర్ కుమార్ (41) రమేష్(30) అతడి ముగ్గురు కుటుంబ సభ్యులు, అనూష(22), మహ్మద్ ఖైజర్ (51), దీపక్ కుమార్ (24), అన్డోజ్ నవీన్‌కుమార్ (26), ప్రశాంత్ (32), ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్ (25), వేణు గుండ (33), చరిత్ (21), చందన మంగ (23), సంధ్యారాణి మంగ (43), గ్లోరియా ఎల్లెస శ్యామ్ (28), జయసూర్య(24), హారిక (30), శ్రీహర్ష (24), శివ (24), శ్రీనివాస రెడ్డి (40), సుబ్రహ్మణ్యం (26), కె.అశోక్ (27), ఎం.జి.రామారెడ్డి (50), ఉమాపతి (32), అమృత్ కుమార్ (18), వేణుగోపాల్‌రెడ్డి (24) ఉన్నారు. ఇందులో సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, హారిక, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ప్రమాదం నుంచి బయటపడ్డారు.
వీరంతా ఎక్కడెక్కడి నుంచి ఎక్కరంటే?
కూకట్ పల్లి నుండి ఆరుగురు
కుత్బుల్లాపూర్ నుండి నలుగురు
ఎస్ఆర్ నగర్ నుండి ముగ్గురు
ఎర్రగడ్డ నుండి ఇద్దరు
మూసా పేట్ నుండి ఇద్దరు
భరత్ నగర్ నుండి ఒక్కరు
వనస్థలిపురం నుండి ఇద్దరు
ప్యారడైజ్ నుండి ఇద్దరు
నాంపల్లి నుండి ఒక్కరు
లకడికపూల్ నుండి ఇద్దరు
ఎల్బీ నగర్ నుండి ఒక్కరు
మరోవైపుఈ ప్రమాద ఘటనకు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.
కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059
ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061
కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు: 9494609814, 9052951010
బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చు.
