BIG BREAKING : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి కానుకగా పెండింగ్‌లో ఉన్న డీఏ (డియర్‌నెస్ అలవెన్స్ -)లలో ఒక డీఏను విడుదల చేస్తామన్నారు. అయితే దీనిని రెండు విడతలుగా ఇస్తామన్నారు. ఒక డీఏను నవంబర్ 1న ఇచ్చే అక్టోబర్ నెల జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లిస్తామని చెప్పుకొచ్చారు.
నవంబర్ లో రూ.105 కోట్లు, జనవరిలో రూ.105కోట్లు చెల్లిస్తామని తెలిపారు. ఉద్యోగులకు డీఏలకు దీని కోసం ప్రతి నెలా రూ, 160 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం చెప్పుకొచ్చారు. దశలవారీగా మిగిలిన డీఏ బకాయిలు, ఇతర అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని ఉద్యోగ సంఘాలకు ఆయన హామీ ఇచ్చారు.
ఇక గత ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు రూ. 7,000 కోట్లు డీఏ బకాయిలు పెండింగ్‌లో పెట్టిందని చంద్రబాబు తెలిపారు. వైసీపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు .