Anakapalli : అనకాపల్లి జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. టెట్ పరీక్షకు వెళ్తున్న యువతి తండ్రి నడుపుతున్న ఆటో ప్రమాదానికి గురై దుర్మరణం చెందింది. విశాఖలోని ఎన్ ఏ డి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ కుమార్తె సునీతను ఈ రోజు జరిగే టెట్ పరీక్షకు తీసుకువెళ్తున్నారు మార్గమధ్యలో అనకాపల్లి సమీపంలోని సుంకరిమెట్ట వద్ద ఆటో దారి తప్పిందని వెనుక కూర్చొన్న కుమార్తె సునీత గూగుల్ మ్యాప్ లో చూసి చెప్పింది.
దీంతో ఆటో తిప్పే క్రమంలో ఎదురుగా రోడ్డును ఢీ కొట్టి బోల్తా పడింది. అనకాపల్లి జిల్లా సుంకరమేట్ట వద్ద జరిగిన ఈ ప్రమాదంలో సునీత అక్కడికక్కడే మరణించారు నిజానికి ఆమె మాకవరపాలెం వద్ద అవంతి కాలేజీలో టెట్ పరీక్ష ఈరోజు రాయాల్సి ఉంది. పరీక్ష రాసేందుకు వెళ్తున్న కూతురు తండ్రి కళ్లెదుటే ప్రాణాలు వివడవడంతో కుప్పకూలిపోయిన తండ్రి విలపించిన తీరు అందర్నీ కన్నీరు పెట్టించింది.
