Visakhapatnam : విశాఖపట్నంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల లెక్చరర్ల లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ డిగ్రీ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విశాఖపట్నం ఎంబీసీ కాలనీలో సమత డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సాయి తేజ (21)అనే విద్యార్థి.
నా కోరిక తీర్చు!
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2025
ఇద్దరు మహిళా లెక్చరర్ల లైంగిక వేధింపులు తట్టుకోలేక డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విశాఖపట్నం ఏంవీపీ కాలనీలోని సమత కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ(21) అనే విద్యార్థి ఆత్మహత్య
కాలేజీలోని ఇద్దరు మహిళా లెక్చరర్లు అసభ్యకర మెసేజ్లు, వీడియోలు పంపించి… pic.twitter.com/PGKEnKqLKO
అయితే కాలేజీలో ఇద్దరు మహిళ లెక్చరర్లు అతనికి అసభ్యకరమైన మెసేజ్లు, వీడియోలు పంపించి లైంగిక వేధించారని.. వారి వేధింపులు తట్టుకోలేక సాయి తేజ సూసైడ్ చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని కేజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు.
గత కొద్ది రోజులుగా సాయి తేజను ఈ ఇద్దరు మహిళల లెక్చరర్లు వేదిస్తున్నారని…తాజాగా ఆ వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని.. తోటి విద్యార్థులు అంటున్నారు. ఈ అన్యయానికి పాల్పడిన ఇద్దరు మహిళ లెక్చరర్లను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. స్టూడెంట్ల ఆందోళనతో కాలేజీ పరిసర ప్రాంతమంతా ఒక్కసారిగా రణరంగంగా మారింది. పోలీసులు కలగజేసుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో స్టూడెంట్ల అందరూ వెనక్కి తగ్గారు.
