BIG BREAKING : ఏపీలో భారీ ఎన్‌కౌంటర్.. హిడ్మా ఖతం!

alluri

BIG BREAKING :  ఏపీలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎన్‌కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి టైగర్‌జోన్‌లో ఎన్‌కౌంటర్ జరగగా.. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. హిడ్మాపై రూ. కోటికిపైగా రివార్డు ఉంది. నవంబర్ 18వ తేదీ ఉదయం 6గంటల నుంచి 7గంటల సమయంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ మరో నలుగురు మావోయిస్టులు మరణించారు. మాడ్వీ హిడ్మి ఆయన అసలు పేరు. కాగా హిడ్మాపై రూ. కోటికిపైగా రివార్డు ఉండగా.. ఆయన భార్యపై రూ.50 లక్షల రివార్డు ఉంది. వారం రోజుల క్రితమే హిడ్మా తల్లిని ఛత్తీస్ గడ్ హోంమంత్రి కలిశారు. 25 ఏళ్ల క్రితం హిడ్మా ఆడవుల్లోకి వెళ్లారు. ఇప్పటికైనా ఇంటికి రారా బిడ్డ అంటూ హిడ్మాను అతని తల్లి వేడుకుంది.

ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా బోర్డర్‌లో మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్‌ తర్వాత భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.