BIG BREAKING : మెదడులో రక్తం గడ్డ కట్టి.. మాజీ మంత్రి కన్నుమూత!

BIG BREAKING : ఏపీ టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారయణ కన్నుమూశారు. మెదడులో రక్తం గడ్డ కట్టే సమస్యతో బాధపడుతున్న ఆయన.. శ్రీకాకుళంలోని బగ్గు సరోజినీ దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

శ్రీకాకుళం నుంచి వరుసగా నాలుగు సార్లు (1985, 89,94,99 ) టీడీపీ తరుపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. 2024 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన మృతి పట్ల టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

ఆయన సతీమణి లక్ష్మీదేవి కూడా తన భర్త గుండ అప్పలసూర్యనారాయణ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు . శ్రీకాకుళం మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా పని చేసి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనసభ్యురాలిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. వీరికి శివ గంగాధర్, విశ్వనాధ్ ఇద్దరు సంతానం.