Geetu Royal : కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో నిబంధనలు మరోసారి గాలికి ఎగిరాయి. బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ గీతూ రాయల్ తన టీంతో కలిసి తిరుమలలో చేసిన పని ఇప్పుడు భక్తుల ఆగ్రహానికి కారణమైంది. శ్రీవారి ఆలయం ఎదుట, పుష్కరిణి వద్ద, ఘాట్ రోడ్డులో కారు ఆపి మరీ సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చిత్రీకరించడం వివాదాస్పదమైంది.
గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లారు. అయితే భక్తితో దర్శనం చేసుకోవాల్సింది పోయి.. ఆలయం ముందు, భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ‘ఖడ్గం’ సినిమాలోని “గోవిందా గోవిందా” పాటకు స్టెప్పులు వేస్తూ వీడియోలు తీశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో భక్తులు, నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. “పవిత్రమైన కొండపై ఇలాంటి వెర్రి చేష్టలు ఏంటి?” అంటూ ఆమెను నిలదీశారు.
ఇంత విషయాన్ని అంత చేసారు..
వీడియో విడుదల చేసిన గీతూ రాయల్..
#Geeturoyal pic.twitter.com/z3RRy2P1EL— YK Tv Digital (@yktvdigital) February 28, 2026
వివాదం ముదరడంతో గీతూ ఆ వీడియోలను డిలీట్ చేశారు. అయితే టీటీడీ అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఆమెపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం రావడంతో ఆమె మరో వీడియో రిలీజ్ చేశారు. అందులో ఏడుస్తూ.. అందరికీ గుడ్ న్యూస్.. నా మీద చర్యలు తీసుకుంటారట, ఇక సంతోషించండి. నా జీవితంలో ఇప్పటికే సగం కోల్పోయాను, ఉన్న కొద్దిపాటి జీవితాన్ని కూడా మీరే తీసేయండి అంటూ ఎమోషనల్ అయ్యారు. తిరుమల వంటి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదని భక్తులు కోరుతున్నారు.
తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్ అండ్ టీం ఓవరాక్షన్
ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో, కౌంటర్స్ వద్ద రీల్స్ చిత్రీకరణ
వీడియోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గీతూరాయల్, ఆమె స్నేహితులు
టీటీడీ నిబంధనలు తుంగలో తొక్కుతున్న యూ ట్యూబర్లు#GeetuRoyal #Tirumala pic.twitter.com/VdDDWhtEZv
— Telugu Stride (@TeluguStride) February 28, 2026
