BIG BREAKING : మరో ఘోరం..ట్రావెల్స్ బస్సు బోల్తా.. స్పాట్ లో 20 మంది!

Sathya Sai district

BIG BREAKING :  ఏపీలో మరో ఘోరం జరిగింది. సత్యసాయి జిల్లాలో జబ్బర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై 2025 నవంబర్ 04వ తేదీ తెల్లవారుజామున బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సురక్ష అనే 30 ఏళ్ల మహిళ మృతి చెందింది.

బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఈ బస్సు వెళ్తుండగా.. ఐషర్ వాహనం అడ్డు రావడంతో అదుపు తప్పినట్లుగా సమాచారం. ఈ ఘటనలో 8 మందికి తీవ్రగాయలయ్యాయి. వెంటనే వారిని అనంతపురం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. దీంతో ట్రావెల్స్ బస్సులో ప్రయాణం అంటేనే జనాలు వణికిపోతున్నారు.

ఇక తెలంగాణలో మరో రెండు బస్సు ప్రమాదాలు జరిగాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి వద్ద, ఉదయం 5 గంటలకు ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుండి మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలవ్వడంతో, కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టంది. ట్రాక్టర్ లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు యమపాశాలై ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా బస్సు ప్రమాదాలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఐదు బస్సు ప్రమాదాలు జరిగాయి. చేవెళ్ల మిర్జాగూడలో సోమవారం ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోగా.. అదే రోజు రాత్రి ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారతి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు.

సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి హైవేపై జబ్బర్ ట్రావెల్స్ బస్సు ఐషర్ వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ మృతి చెందగా, బస్సులోని 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ జిల్లాలోని బుగ్గబావిగూడెం వద్ద ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయలయ్యాయి.