Kavitha : మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన మొక్కు తీర్చుకోవడానికి తిరుమల చేరుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు నుంచి కోర్టు పూర్తిగా విముక్తి కల్పించిన నేపథ్యంలో ఆమె అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి బయలుదేరారు. అలిపిరి పాదాల మండపం దగ్గర ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.
గత నాలుగేళ్లుగా చేయని తప్పుకు ఎంతో మానసిక వేదన అనుభవించానని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. దేవుడి దయ వల్ల, న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం వల్ల కేసు నుంచి బయటపడ్డానని సంతోషం వ్యక్తం చేశారు. కేసుల నుంచి విముక్తి లభిస్తే నడక దారిన తిరుమలకు వస్తానని మొక్కుకున్నానని, అందుకే ఇప్పుడు ఆ మొక్కు చెల్లించుకుంటున్నట్లు వివరించారు.
అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు బయల్దేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
పాదయాత్ర ప్రారంభానికి ముందు అలిపిరి మెట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసిన కవిత, ఆమె భర్త అనిల్, కుమారుడు ఆదిత్య, జాగృతి నాయకులు pic.twitter.com/Qij1kLolqJ
— Ram Macha🚩 (@Ram_Machaa) March 5, 2026
శ్రీవారి మెట్ల మార్గంలో నడుస్తూ సామాన్య భక్తులతో కలిసి ఆమె ముందుకు సాగుతున్నారు. రాత్రికి తిరుమలలోనే ఉండి, రేపు ఉదయం విరామ సమయంలో స్వామిని దర్శించుకోనున్నారు. ఈ పర్యటన తర్వాత కవిత మళ్లీ రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ముఖ్యంగా తెలంగాణ జాగృతి ద్వారా మహిళా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత క్లీన్ చిట్‌తో బయటకు వచ్చిన కవితకు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలుకుతున్నారు.
