Biryani : బయట బిర్యానీ తింటున్నారా.. ఇదోసారి చూడండి!

biryani

Biryani : బయట ఫుడ్ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదొక్కటి చాలు. ఏపీలోని అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో ఒక హోటల్ నుంచి తెచ్చుకున్న బిర్యానీ పార్సిల్‌లో చనిపోయిన మండ్రకప్ప కనిపించింది. బిర్యానీ తింటుండగా, అందులో చికెన్ పీస్‌లతో పాటుగా మండ్రకప్ప కనిపించడంతో కస్టమర్లు షాకయ్యారు. ఈ విషయాన్ని గమనించిన యువకులు వెంటనే ఆ బిర్యానీని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో క్షణాల్లో విస్తృతంగా వైరల్ అయింది.

హోటల్ అజాగ్రత్త, ఆహార నాణ్యత లోపంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత జరిగిన ఇప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించలేదు. విషయం తెలిసిన చూసి చూడనట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. విషయం బయటకు రావడంతో ఇప్పటికే రెస్టారెంట్ యాజమాన్యం సంబంధిత అధికారులకు తాయిలాలు సమర్పించినట్లుగా జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇక ఘటనపై ఎలాంటి పిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు. ప్ర‌తీ హోట‌ల్స్‌లోనూ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారుల ఫోన్ నెంబ‌ర్లు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు సూచిస్తున్నారు.