Tirupati : తిరుపతిలో దారుణం జరిగింది. పట్టణంలో పాలిటెక్నిన్ చదువుకుంటున్న ఒక మైనర్ బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలిక ఓ ప్రైవేట్ హాస్టల్ నుంచి మరో హాస్టల్‌కు మారేందుకు ర్యాపిడో ఆటోను బుక్ చేసుకుంది.
ఈ క్రమంలో ఆటో డ్రైవర్ బాలికతో మాటలు కలిపి, సాయం చేస్తానని నమ్మించి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తాను డబ్బు సాయం కూడా చేస్తానని నమ్మబలికి, మోసపూరితంగా ఆ బాలికను తన గదికి తీసుకెళ్లాడు. గదికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి, బాలికను భయభ్రాంతులకు గురిచేశాడు.
తిరుపతిలో దారుణ ఘటన
పాలిటెక్నిన్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటోడ్రైవర్ అత్యాచారం
ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతూ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని
హాస్టల్ నుండి మరొక హాస్టల్‌కు షిఫ్ట్ అవుతున్న సమయంలో ఆటో డ్రైవర్ సాయికుమార్‌తో పరిచయం
ఆటో డ్రైవర్‌ను ఆర్థిక సహాయం… pic.twitter.com/i2ft0VpTTC
— Telugu Feed (@Telugufeedsite) December 9, 2025
ఈ దారుణంపై భయపడిన బాలిక కొద్దిరోజుల తర్వాత తన స్నేహితురాలితో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు, అలిపిరి పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై క్రైమ్ నెంబర్ 448/2025 ఫోక్సో యాక్ట్ 2012 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక ఇటీవల తిరుపతిలో మరో దారుణం జరిగింది. నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ దారుణానికి పాల్పడ్డాడు. యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెను లోబర్చుకొని గర్భిణీని చేశాడు. అయితే ఈ దారుణానికి మరో ప్రొఫెసర్ కూడా సహకరించడం గమనార్హం.
డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఆ విద్యార్థినితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను మరో ప్రొఫెసర్ తన ఫోన్‌లో రికార్డు చేశాడు. అనంతరం వాటిని అడ్డు పెట్టుకుని విద్యార్థినిని బెదిరించడం మొదలు పెట్టాడు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు నేరుగా ఈ ఇద్దరు ప్రొఫెసర్‌లపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు సైతం ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి వెంటనే స్పందించారు.
ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనతో వేధింపులతో తీవ్ర ఆవేదనకు గురైన విద్యార్థిని, తన చదువును మధ్యలోనే ఆపివేసి తన స్వస్థలమైన ఒరిస్సాకు వెళ్ళిపోయింది.
