Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు.. వారికి స్థానిక మాజీ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి దర్శన ఏర్పాట్లు చేశారు. కవిత కుటుంబ సభ్యులతో ప్రత్యేక రాహు, కేతు సర్ప దోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. పూజలు అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాట్లు ఆలయం అధికారులు కల్పించారు.
వేద పండితులచే ఆశీర్వాదం స్వామి అమ్మవారు తీర్థప్రసాదాలు అందజేశారు.మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పరిపాలనలో పది సంవత్సరాలపాటు సుభిక్షంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు ప్రజలు గురవుతున్నారని అన్నారు. ఇక తాను త్వరలో తెలంగాణలో యాత్ర చేపట్టబోతున్నానని యాత్ర ద్వారా ప్రతి ఒక్కరిని కలుస్తానని యాత్రలో స్పందన ప్రజల అభిప్రాయాలను బట్టి ముందుకు పోతానని అన్నారు పార్టీ నిర్మాణం అనేది రానున్న రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.
శ్రీకాళహస్తి ముక్కంటిని దర్శించుకున్న కవిత…!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు.. #Kavitha #AndhraPradesh #TelanganaPolitics #TelanganaNews pic.twitter.com/jrkewJlmen
— kotlata (@kotlataweb) October 19, 2025
అంతకుముందు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు కవిత. బీసీ రిజర్వేషన్ల కోసం సమాజమంతా కలిస్తేనే సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ రిజర్వేషన్ ఇస్తానని చెబుతుంటే, బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. బీసీ బిల్లుకోసం తెలంగాణ బీజేపీ ఎంపీలు రిజైన్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ బంద్‌లో సీఎం రేవంత్ పాల్గొని ఉంటేనే నిజమైన చిత్తశుద్ధి తెలిసేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ బీసీల మీద నిజమైన ప్రేమ లేదన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నామని కవిత స్పష్టం చేశారు.