పెళ్లయిన ఐదు నెలలకే నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొవ్వ మండలం కొండవరం గ్రామానికి చెందిన నాగరాజు, శివనందేశరమ్మల కుమార్తె శ్రీవిద్య ఎమ్మెస్సీ పూర్తి చేసింది. 2025 ఏప్రిల్ 23న కంకిపాడు మండలం కుందేరుకు చెందిన అరుణ్‌కుమార్‌తో ఆమెకు ఐదు నెలల క్రితం పెళ్లి చేశారు. పెళ్లిలో రూ.10లక్షల కట్నం, రూ.10లక్షలు విలువైన బంగారం ఇచ్చారు. అరుణ్ ఉయ్యూరు మండలం కలవపాములలో సర్వేయర్‌గా ఉద్యోగం చేస్తుండగా.. శ్రీవిద్య ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది.
కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ లేఖ
అరేయ్ తమ్ముడు జాగ్రత్త.. ఈ సారి నేను నీకు రాఖీ కట్టలేనేమో
పెళ్ళైన ఆరు నెలలకే భర్త వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో విలేజ్ సర్వేయర్‌గా పని చేస్తున్న రాంబాబుకు, ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని… pic.twitter.com/g0zSzeW6S4
— Telugu Scribe (@TeluguScribe) August 4, 2025
ఎన్నో ఆశలతో కాపురానికి వెళ్లిన శ్రీవిద్యకు అత్తింటి వేధింపులు ఐదు నెలలకే స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో ఆమె ఆదివారం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తనను తన భర్త తరచూ దాడి చేసి వేధిస్తున్నాడని, భరించలేకపోతున్నానంటూ తన తండ్రికి శ్రీవిద్య సూసైడ్ లేఖ రాసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. తనను వేధించిన భర్త, అత్తమామల్ని వదలొద్దని ఆమె సూసైడ్ నోట్‌లో శ్రీవిద్య రాసుకొచ్చింది.
ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో తమను వెంటనే రమ్మని ఫోన్ వచ్చిందని, తమ కుమార్తె ఇంటికి వెళ్లే సరికి ఆమె శవమై కనిపించిందని శ్రీవిద్య తల్లిదండ్రులు బోరున విలపించారు. అల్లుడే తమ కుమార్తెను చంపిఉంటాడని శ్రీవిద్య తండ్రి నాగరాజు ఆరోపిస్తున్నారు. ఉయ్యూరులోని తమ ఇంటిని అమ్మేసి డబ్బులివ్వాలని తన కుమార్తెను పెళ్లయిన రోజు నుంచే వేధిస్తున్నాడని తెలిపారు. నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. భర్త నాగరాజు, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.