Kakinada: కానిస్టేబుల్ బలుపు.. ప్రాణాలతో పోరాడుతున్న మైనర్!

kakinda

Kakinada: కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ అత్యుత్సాహం ఏకంగా మైనర్ ప్రాణాల మీదికి వచ్చింది. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు బాలుడు. దీపావళి సందర్భంగా క్రాకర్స్ విషయంలో బాలుడు అక్షయ్‌తో కానిస్టేబుల్ సతీష్ వాగ్వాదం జరిగింది.

దీంతో చిన్న విషయానికి బాలుడిని కానిస్టేబుల్ చితకబాదాడు. దీంతో కానిస్టేబుల్ సతీష్ అత్యుత్సాహంతో బాలుడి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. బాలుడికి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దళిత సంఘాల ఆందోళనకు దిగాయి.

అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆందోళన సాగింది. విషయం తెలుసుకున్న పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు అక్కడికి చేరుకున్నారు. కానిస్టేబుల్‌ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.