BIG BREAKING : కాకినాడ తుని కేసులో సంచలనం.. టీడీపీ నేత సూసైడ్!

tdp

BIG BREAKING : కాకినాడ తుని కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైనర్‌ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు, టీడీపీ నేత తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు కస్టడీలోనే నిందితుడు నారాయణ ప్రాణాలు తీసుకున్నాడు. మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తుండగా టాయిలెట్ వస్తుందని చెప్పి పోలీసు వాహనం నుంచి కిందికి దిగిన నారాయణరావు సమీపంలోని తుని కోమటి చెరువులో దూకేశాడు. నిందితుడి కోసం గజ ఈత గాళ్లతో పోలీసుల గాలింపు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని డిఎస్పీ శ్రీ హరిరాజు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మృతదేహం లభ్యమైంది.

తుని రూరల్ పరిధిలోని ఒక గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక (సుమారు 13 సంవత్సరాలు)పై టీడీపీ నేత తాటిక నారాయణరావు (62) అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు బాలికకు మాయమాటలు చెప్పి, తాను తాతయ్య వరస అవుతానని చెప్పి గురుకుల పాఠశాల సిబ్బందిని నమ్మించి, బాలికను హాస్టల్ నుంచి బయటికి తీసుకెళ్లాడు.

అనంతరంసమీపంలోని హంసవరం సపోటా తోటలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. తోటలో అనుమానాస్పదంగా ఉన్న నిందితుడిని, బాలికను చూసిన ఒక స్థానికుడు ప్రశ్నించడం, వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో నిందితుడు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బాలికను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై రాజకీయంగా, సామాజికంగా తీవ్ర స్థాయిలో స్పందన వచ్చింది. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి, వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది.

ఇక నారాయణరావు ఇప్పటికే నాలుగైదు సార్లు బాలికను బంధువులంటూ బయటికి తీసుకెళ్లడని హాస్టల్ వర్గాలు విచారణలో వెల్లడించాయి. అయితే కేసును రాజకీయ కోణంలో తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ రూరల్ ఎస్ఐ తో వాగ్వాదానికి దిగారు బాలిక కుటుంబ సభ్యులు. ఈ కేసును ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలియగానే తాటిక నారాయణరావుకు బడిత పూజ చేశారు గ్రామస్థులు.