BREAKING :ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వహనమిత్ర పథకానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేసింది. ఆటో డ్రైవర్లకు రూ.15,000- ఆర్థిక సాయం కోసం అర్హత ఉన్నవారు ఈ నెల 19 తేదీ లోపు గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
2025−-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సొంత వాహనదారులైన ఆటో రిక్షా, మోటారు క్యాబ్/ మ్యాక్సీ డ్రైవర్లకు రూ. 15వేలు ఆర్థిక సహాయం అందిస్తారు. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ కార్యదర్శులకు అవసరమైన పత్రాలతో దరఖాస్తులు చేసుకోవాలి.
దరఖాస్తుదారుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డులు కలిగి ఉండవలెనని, ఏపీలో వాహన రిజిస్ట్రేషన్ కలిగి ఉండడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్ నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఒక కుటుంబం ఒక వాహనం (ఆటో రిక్షా, మోటారు క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ ) కోసం మాత్రమే ప్రయోజనం పొందేందుకు అర్హులు అవుతారు.
ఈ పథకానికి ఎంపికైన ఆటో డ్రైవర్లకు ఆక్టోబర్ లో దసరా సందర్భంగా రూ.15 వేలు అందిస్తారు. కాగా గతంలో ఈ పథకం కింద రూ. 10,000/- సాయం అందించేవారు. ఈ ఆర్థిక సహాయం డ్రైవర్లకు వాహనాల మరమ్మత్తులు, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులను భరించడానికి తోడ్పడుతుంది.

