BIG BREAKING : మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఆయన ఒక సరికొత్త డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ వార్తా సంస్థ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ఆయన స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు.
Dear Friends,
Very soon, we will be launching a digital media platform for news in Telugu, Hindi and English. This platform will be balanced, unbiased and committed to the truth.Our aim is to give a voice to the people and highlight real issues that matter to the common man,…
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 11, 2026
ఈ మీడియా ప్లాట్‌ఫామ్ పూర్తిగా నిష్పక్షపాతంగా ఉంటుందని, ఏ రాజకీయ పార్టీకి వమ్ము కాకుండా కేవలం నిజాయితీతో కూడిన వార్తలను మాత్రమే అందిస్తుందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. సమాజంలో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, పేదల గొంతుకగా ఈ సంస్థ పనిచేస్తుందని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన నిజమైన సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను విజయవంతంగా ప్రారంభించిన తర్వాత, ఇదే విలువలతో ఒక తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌ను కూడా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కొత్త మీడియా సంస్థకు సంబంధించిన పేరును అతి త్వరలోనే ప్రకటిస్తానని విజయసాయి రెడ్డి తెలిపారు. రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ, తన మీడియా సంస్థ మాత్రం స్వతంత్రంగా పనిచేస్తుందని ఆయన హామీ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
