Srikakulam : మహాపతివ్రత.. ప్రియుడి కోసం మొగుడ్ని సైలెంట్ గా లేపేసింది!

Srikakulam : ప్రియుడితో అక్రమసంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తలను, కనిపెంచిన పిల్లలను కూడా చంపాడానికి భార్యలు ఏ మాత్రం కనికరం చూపించడం లేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను నిద్రమాత్రాలు ఇచ్చి మరీ లేపేసింది ఓ ఇల్లాలు. టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం..శ్రీకాకుళం పాతపట్నంలోని మొండిగొల్లవీధికి చెందిన నల్లి రాజు (34)కు మౌనిక అనే యువతితో ఎనిమిదేళ్ల కిందట పెళ్లి అయింది. వీరికి ఇద్దరు అబ్బాయిలున్నారు.

మౌనికకు స్థానికంగా ఉండే గుండు ఉదయ్‌ కుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఉదయ్‌కుమార్‌కు కూడా పెళ్లి అయింది. అయితే వీరి వ్యవహారం మౌనిక భర్తకు తెలిసింది. తీరు మార్చుకోవాలంటూ భార్యను పలుమార్లు హెచ్చరించాడు రాజు. ఎంత చెప్పిన మౌనికలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా ప్రియుడితో సుఖపడటానికి భర్త అడ్డుపడుతున్నాడని అతని అడ్డు తొలగించాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.

అటు మౌనికతోనే కలిసి ఉండాలని ఫిక్స్ అయిన ఉదయ్‌కుమార్‌ కూడా తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రాజు మత్తులో ఉండగా ఇంట్లోనే చంపాలని ఉదయ్, మౌనిక ఫిక్స్ అయ్యారు. ఇంట్లోనే రెండు రోజుల పాటు మౌనిక భర్త రాజుకు భోజనంలో నిద్ర మాత్రలు కలిపింది. ఆగస్టు 5వ తేదీన అర్ధరాత్రి రాజు నిద్రపోయిన తర్వాత ఉదయ్‌తోపాటు మల్లిఖార్జున్‌ అనే మరో వ్యక్తికి ఫోన్‌ చేసి పిలిపించింది.

నిద్రలో ఉన్న రాజు కాళ్లను మౌనిక గట్టిగా పట్టుకోగా మల్లిఖార్జున్, ఉదయ్ అతని ముఖంపై దిండుతో అదిమి ఊపిరిఆడకుండా చేసి హత్య చేశారు. అనంతరం దీన్ని ఓ యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. రాజు బైక్ ను గ్రామశివారులో పడేసి దాని పక్కనే అతన్ని శవాన్ని పడుకోబెట్టారు. మర్నాడు మౌనిక కుటుంబసభ్యులకు,బంధువులకు ఫోన్‌ చేసి తన భర్త కనిపించడంలేదంటూ నాటకం మొదలెట్టింది.

ఆగస్టు 7న ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు గుట్టు రట్టైంది. దీంతో ఉదయ్‌కుమార్, మల్లికార్జున్‌తోపాటు మౌనికను కూడా అరెస్ట్ చేసి తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం చేసినట్లుగా అంగీకరించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.