YCP : సచివాలయ ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ కార్యకర్త

YCP : పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలో సచివాలయ ఉద్యోగినితో… YCP కార్యకర్త అసభ్యంగా ప్రవర్తించాడు. YCPకు చెందిన జాజుల పెద తిరుపతయ్య అనే వ్యక్తి తమ గేదె దూడకు బాగాలేదని చెప్పడంతో… అతని ఇంటి వద్దకు సచివాలయ ఉద్యోగిని వెళ్లి దూడకు ఇంజక్షన్ చేశారు. ఇంట్లో పశుదాణా చూడాలంటూ పిలిచి… లోపలికి వెళ్లిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే మహిళ ధైర్యంగా ఫోన్ తో అతని మొహం మీద కొట్టి బయటకు పరుగులు తీసి కేకలు వేసింది. కేకలు విని… చుట్టుపక్కల వారు వచ్చి పెద తిరుపతయ్యకు దేహశుద్ధి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని… నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్ఐ తెలిపారు..