టీడీపీ కౌన్ కిస్కా గొట్టంగాళ్లు…. కోపంతో ఊగిపోయిన స్పీకర్ తమ్మినేని

టీడీపీ కౌన్ కిస్కా గొట్టంగాళ్లు పిటిషన్ వేస్తే భయపడోద్దు…ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీలు అగ్గిమీద గుగ్గిలం ఉన్నాయి. సమయం దొరకితే చాలు ఒకరిపై ఇంకొకరు విరుచుకుపడుతున్నారు. ఇరు పార్టీ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో ఉంటోంది. ఈ మధ్య అసెంబ్లీ సాక్షిగా అధికార, విఫక్షాల మధ్య ఏ రేంజ్ లో మాటల యుద్ధం జరిగిందో ప్రత్యక్షంగా చూశారు. అయితే వీరందరికి సర్దిచెబుతూ అసెంబ్లీలో వాడాల్సిన పదజాలం గురించి చెబుతూ సమన్యాయం పాటించేవాడు. స్పీకర్. అటువంటి స్పీకర్ ఓ సభలో టీడీపీ కౌన్ కిస్కాగాళ్లు అనే సరికి చర్చనీయాంశమైంది.

శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు దిశానిర్దేశం చేసేందుకు మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో ప్రభుత్వ బాధ్యతలు, చేయాల్సిన పనులు, పలు అంశాలపై ఉపన్యాసిస్తున్నారు. అయితే ఆ సభకు ముఖ్య అతిథిగా స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరయ్యారు. వాలంటీర్లకు విధుల గురించి అవగాహన కల్పిస్తూ టీడీపీ కౌన్ కిస్కాగాళ్లు కోర్టులో పిటిషన్లు వేస్తే భయపడోద్దు. మీ డ్యూటీ మీరు చేయండి…మీకు మేం ఉన్నాం అన్నారు.

ఓ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ కార్యక్రమాల సమీక్ష ఎలా నిర్వహిస్తాడు అంటూ అడ్డుతగులుతున్నారని అన్నారు. తన నియోజకవర్గంలో ప్రజలకు ప్రభుత్వం సేవలు అందుతున్నాయో లేదో తెల్సుకునే బాధ్యత తనపై ఉందన్నారు. నేను నా నియోజకవర్గానికి ముందు ఎమ్మెల్యేను…. ఆ తర్వాతే స్పీకర్ నూ అంటూ మాట్లాడారు. ఇక ఈ సభలో టీడీపీ వారిని దూషించారంటూ టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

స్పీకర్ గా ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఉన్నతమైన పదవిలో ఉన్నాడని మర్చిపోయి….వైసీపీ కార్యకర్తల మాట్లాడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. ఈ విషయంపై చంద్రబాబు కూడా స్పందించారు. ఈ రోజు జరిగిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో బాబు మాట్లాడారు. టీడీపీ కౌన్ కిస్కా గొట్టంగాళ్లు అంటున్నారని…పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందన్నారు. సభలో వైసీపీ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. అయితే ఈ విషయంపై స్పీకర్ తమ్మినేని ఇంకా ఎటువంటి వివరణ ఇవ్వలేదు.

LEAVE A REPLY