టెన్షన్ వద్దు మావా..CIBIL Score సున్నా ఉన్నా..Loan ఇచ్చే 3 Best Apps ఇవే!

Loan apps without cibil score in telugu

CIBIL Score : మనకు అర్జెంట్‌గా లోన్ అవసరమైతే ఏదైనా బ్యాంక్ లోన్‌కి అప్లై చేస్తే.. వాళ్లు అడిగే మొదటి ప్రశ్న ఏంటి.. మీ సిబిల్ స్కోర్(CIBIL Score) ఎంత? అనే కదా.. ఒకవేళ మీ స్కోర్ సున్నా ఉంటే బ్యాంకులు వెంటనే మొహం చాటేస్తాయి. ఇలాంటి టైమ్ లో అస్సలు టెన్షన్ పడకండి. మీ సిబిల్ స్కోర్ లేకపోయినా, కేవలం మీ ఆధార్, పాన్ కార్డుతో నిమిషాల్లో లోన్ ఇచ్చే కొన్ని నమ్మకమైన యాప్స్ ఉన్నాయి. మీ మొబైల్ నుండే అప్లై చేసుకుని, నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌కి డబ్బులు పంపే ఆ టాప్-3 యాప్స్ ఏంటో, వాటిలో లోన్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Also Read :  Upcoming Smartphones 2026 : ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? ఒక్క వారం ఆగండి.. మార్కెట్లోకి 3 అదిరిపోయే ఫోన్లు!

1. KreditBee (క్రెడిట్ బీ)

తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఇది ఫస్ట్ ఛాయిస్ ఈ యాప్. ముఖ్యంగా చిన్న అవసరాలకు ఇది చాలా ఫేమస్ కూడా. రూ.1,000 నుండి రూ. 4 లక్షల వరకు లోన్ ఇస్తారు. మీ సిబిల్ స్కోర్ సున్నా ఉన్నా సరే, మీ ప్రొఫైల్ బాగుంటే చిన్న అమౌంట్‌తో లోన్ స్టార్ట్ చేస్తారు. సకాలంలో కడితే లిమిట్ పెరుగుతుంది. పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు లోన్ అప్రూవ్ చేస్తారు.

2. Branch (బ్రాంచ్ లోన్ యాప్)

ఎటువంటి సిబిల్ స్కోర్ అడగకుండా లోన్ ఇచ్చే యాప్స్‌లో ‘బ్రాంచ్’ ఒకటి. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. రూ.500 నుండి రూ.50,000 వరకు లోన్ ఇస్తారు. సిబిల్ స్కోర్ అస్సలు అడగరు. పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు లోన్ అప్రూవ్ చేస్తారు.

3. SmartCoin / Olyv (స్మార్ట్‌కాయిన్)

తక్కువ ఆదాయం ఉన్నవారికి, చిన్న వ్యాపారం చేసుకునే వారికి ఇది బెస్ట్ యాప్. రూ.1,000 నుండి రూ. లక్ష వరకు లోన్ ఇస్తారు. మీ జీతం రూ.10,000 ఉన్నా సరే లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 600 కంటే తక్కువ ఉన్నా, వీరు మీకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. డిజిటల్ ప్రాసెస్ ద్వారా కేవలం 5 నిమిషాల్లో అప్రూవల్ వస్తుంది. కేవైసీ (KYC) డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుంది.

Also Read :  PhonePe CIBIL Score Check Telugu : PhonePeలో తరచూ సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నారా? మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా? నిజమెంత?

ఈ విషయాలు గుర్తుంచుకోండి

అయితే ఇందులో లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి. బ్యాంకులతో పోలిస్తే ఈ యాప్స్‌లో వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి. సుమారు 2% నుండి 3% నెలకు ఉంటాయి. లోన్ అమౌంట్ నుండి కొంత ఫీజు కట్ చేసుకుని మిగిలిన డబ్బులు మీ అకౌంట్‌లో వేస్తారు. టైమ్ కు లోన్ కట్టకపోతే పెనాల్టీలు పడతాయి, అలాగే మీ సిబిల్ స్కోర్ కూడా మరింతగా దెబ్బతింటుంది. ఈ మూడు యాప్స్ RBI రిజిస్టర్డ్ NBFC భాగస్వాములతో పనిచేస్తున్నాయి.