బిగ్ బాస్-3 : శ్రీరెడ్డిని గుర్తుచేసుకున్న చిరంజీవి

బిగ్ బాస్-3 : శ్రీరెడ్డిని గుర్తుచేసుకున్న చిరంజీవి

చిరంజీవి ఏంటి శ్రీరెడ్డిని గుర్తు చేసుకోవడమేంటి అనుకుంటున్నారా ? అదంతే. ఏపీ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్-శ్రీరెడ్డి ఫ్యాన్స్ మధ్య వివాదం ఏ స్థాయిలో జరిగిందో గుర్తుంది కదా. పాపం ఆ ఎపిసోడ్ లో నోరువిప్పని చిరు.. బిగ్ బాస్ స్టేజ్ పై మాత్రం దాన్ని గుర్తుచేసుకున్నారు. ఎలాగంటే బిగ్ బాస్-3 వందరోజుల రియాలిటీ షో ముగిసింది. గ్రాండ్ ఫినాలేలో ఎన్నో ఈవెంట్స్ జరిగినా మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ హైలైట్. కంటెస్టెంట్లతో స్పాంటేనియస్ గా సైరా రియాక్ట్ అయిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అందులో భాగంగా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రిని అభినందించారు మెగాస్టార్. అది తన ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగత విషయాన్ని గుర్తుపెట్టుకుని మరీ తమన్నాని పొగడటం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది.

పవన్ కళ్యాణ్-శ్రీరెడ్డి ఇష్యూలో తమన్నా సింహాద్రి శ్రీరెడ్డికి మద్ధతుగా నిలిచింది. కానీ ఓ ఇష్యూలో పవన్(మెగాస్టార్) తల్లి(అంజనమ్మ)ని తిడుతూ… మా—ద్ అని కామెంట్ చేసింది శ్రీరెడ్డి. ఆ ఇష్యూలో శ్రీరెడ్డితో విబేధించి… ఆమెకు కటీఫ్ చెప్పింది తమన్నా. ఆ ఎపిసోడ్ ను గుర్తుచేసిన చిరు తమన్నాని ఉద్దేశిస్తూ.. ‘‘ వెరీ డైనమిక్ గర్ల్.. తేడా వస్తే చీల్చి చెండాడేస్తావమ్మా.. ప్రేమిస్తే మనసిచ్చేస్తావ్… నేను అబ్జర్వ్ చేశా. తప్పు జరిగితే బహిరంగంగా బాహటంగా మాట్లాడగల ధైర్యం గల వ్యక్తివి. నువ్వు అప్పటిదాకా ఎవరిని(శ్రీరెడ్డి) సపోర్ట్ చేసినా సరే.. సపోర్ట్(శ్రీరెడ్డి) చేస్తున్న వాళ్లు… మంచి వ్యక్తుల(పవన్ కళ్యాణ్)ను గనుక విమర్శిస్తే ఆ ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకుని మరీ బయటికొచ్చి తప్పు అని చెప్పగల ధైర్యం నీకుంది. ఐ అప్రిషియేట్ యూ. ఇది నీకూ నాకూ మాత్రమే అర్థమయ్యే విషయం. ఎస్. రైట్ అమ్మ గాడ్ బ్లెస్ యూ’’. అంటూ గతాన్ని గుర్తుచేసుకున్నారు. సైరా మాట్లాడుతున్నంత సేపు తమన్నా సింహాద్రి ఏడుపు ఆపుకోలేక ఎమోషన్ కు గురైంది. అసలు బిగ్ బాస్-3 షోలో తమన్నా చూడగానే ఆ ఎపిసోడ్ గుర్తుచేసుకోవడమేంటోనని షాకవుతున్నారంతా. పాత పగల్ని చిరు అంత ఈజీగా మర్చిపోరడానికి ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు సినీ అభిమానులు.