Bigg Boss : పెళ్లిపీఠలు ఎక్కనున్న బిగ్ బాస్ జంట..? హౌస్ నుంచి బయటికి రాగానే…..

బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగడం ఎంత కామనో… కొందరి మధ్య గిల్లికజ్జాలు, ప్రేమలు చిగురించడం కూడా అంతే కామన్. మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో కూడా అలాంటి ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సీజన్ లో రాహుల్, పునర్నవి భూపాలం మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ను బాగా కనెక్ట్ చేసింది. పునర్నవి బయటికెళ్లిన తర్వాత కూడా… రాహుల్ చాలా సార్లు పున్నును గుర్తు చేసుకున్నాడు. పునర్నవి ఎలిమినేట్ అయిన రోజు రాహుల్ పాడిన సాంగ్ ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించాయి.

అయితే…అలాంటి లవ్ కెమిస్ట్రీ హౌజ్ బయటికి వచ్చాకా పెళ్లి పీఠల దాకా కూడా వెళ్తుంది. తాజాగా కన్నడ బిగ్‌బాస్ సీజన్ ఆరులో పాల్గొన్న చందన్ శెట్టి, నివేదితా గౌడల పరిచయం ప్రేమగా మారింది. వీరు బిగ్‌బాస్ సీజన్-6లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కలిసివచ్చింది. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా  వీళ్ల ప్రేమ కొనసాగింది. ఈ మధ్యే దసరా ఉత్సవాలను పురస్కరించుకొని మైసూరులో ఓ వేదికపై తమ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా చందన్, నివేదితల బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థం ఘనంగా జరిగిపోయింది. త్వరలోనే ఈ బిగ్ బాస్ జంట తమ పెళ్లి తేదీని ప్రకటించనున్నారు.