Bigg Boss 3: బిగ్ బాస్ ఫినాలేకి టికెట్ గెలిచిన రాహుల్ సిప్లీగంజ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఫైనల్ కి వచ్చేసింది. ఇప్పటికే 13 వారాలు కంప్లీట్ అయ్యాయి. బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు, సభ్యుల ఆటలు రసవత్తరంగా మారాయి. మరో రెండు వారాల్లో ఫినాలే జరగనుంది. ఈ వారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో రాహుల్ సిల్పిగంజ్… టాస్క్ లో గెలిచి టికెట్ టు ఫినాలే కొట్టేశారు. నామినేసన్ల టాస్క్ లో గెలవడంతో… రాహుల్ నేరుగా ఫినాలేకు చేరుకున్నారు. రాహుల్‌ని అభినందించిన బిగ్‌ బాస్ ఫైనల్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక మిగిలిన సభ్యులు వరుణ్ సందేశ్, అలీ రెజా, బాబా భాస్కర్, శ్రీముఖి, శివజ్యోతి ఈ వారం నామినేషన్లో ఉన్నారు. ఈ వీకెండ్ లో ఇద్దరు సభ్యులు ఎలిమినేట్ అవుతారని.. మిగిలిన నలుగురు సభ్యులు ఫైనల్‌కు వెళ్తారని ప్రచారం జరుగుతోంది.

Leave a Reply