కూరగాయాలు అమ్ముకుని సాదాసీదా వ్యక్తికి కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీజేపీ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘోసి అసెంబ్లీ స్ధానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా..కూరగాయలు అమ్ముకుని జీవించే నంద్‌లాల్‌ రాజ్‌భర్‌ కుమారుడు విజయ్‌ రాజ్‌భర్‌ను ఎంపిక చేసింది. BJP నాకు చాలా అత్యున్నత బాధ్యత కట్టబెట్టిందని, తండ్రి ఫుట్ పాత్ పై కూరగాయలు అమ్ముతాడు, నన్ను గెలిపిస్తే ప్రతీ పేదవాడికి అందుబాటులో ఉంటానన్నాడు విజయ్. విజయ్‌ బీజేపీలో చురుకుగా పనిచేయడంతో పాటు నగర పార్టీ అధ్యక్షడిగా వ్యహరిస్తున్నారు. సహదత్‌పురా నుంచి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గతంలో పోటీచేసిన విజయ్‌ అక్కడి నుంచి గెలుపొందారు. అక్టోబర్‌ 21న 13 రాష్ట్రాల్లో జరిగే ఉప ఎన్నికలకు 32 మంది అభ్యర్ధులతో కూడిన జాబితాను బీజేపీ రీసెంట్గానే ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.