MLA : పలకడానికి ఇబ్బందికరంగా, వినడానికి అసభ్యకరంగా ఉన్న ఒక గ్రామ పేరును వెంటనే మార్చాలని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగజ్ నగర్ మండల పరిధిలో ఉన్న ‘ల..జగూడ’ (Lanjaguda) అనే గ్రామం పేరు ఉచ్చరించడానికి గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు.
పలకలేని ఊరు పేరుతో కష్టాలు…
మార్చాలి అని ఎమ్మెల్యే డిమాండ్.
కాగజ్ నగర్ సమీపంలో ఉన్న ల..జగూడ అనే ఊరు పేరు మార్చాలి
గ్రామస్తులు నందిగూడ అని మార్చుకున్నారు, రెవెన్యూ రికార్డుల్లో కూడా మార్చాలని కోరుతున్నాను
– బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు pic.twitter.com/zVOGoGt1CX
— kotlata (@kotlataweb) January 3, 2026
ఈ పేరు వల్ల పడుతున్న అవమానాన్ని భరించలేక గ్రామస్తులు ఇప్పటికే తమ గ్రామాన్ని నందిగూడగా పిలుచుకుంటున్నారని, గ్రామ పంచాయతీలో కూడా తీర్మానం చేసుకున్నారని తెలిపారు. గ్రామస్తులు పేరు మార్చుకున్నప్పటికీ, ప్రభుత్వ రికార్డుల్లో మరియు రెవెన్యూ పత్రాల్లో ఇంకా పాత పేరే కొనసాగుతోందని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
దీనివల్ల ధ్రువీకరణ పత్రాలు పొందేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రెవెన్యూ రికార్డుల్లో గ్రామం పేరును అధికారికంగా నందిగూడగా మార్చాలని ఆయన అసెంబ్లీ సాక్షిగా కోరారు.
కాగా 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని కాగజ్‌నగర్ మండలంలో మండలంలో ఉండేది.
