Boiled egg vs Omelette : గుడ్డు.. ప్రోటీన్ కావాలన్నా, బలం రావాలన్నా అందరికీ గుర్తొచ్చే మొదటి ఆప్షన్. అయితే చాలా మందికి ఒకటే డౌట్.. “గుడ్డును ఉడకబెట్టుకుని తింటే మంచిదా? లేక ఆమ్లెట్ వేసుకుని లాగించేస్తే బెటరా?” అని. కొంతమంది ఉడకబెట్టిన గుడ్డు చప్పగా ఉంటుందని ఆమ్లెట్ వైపు మొగ్గు చూపుతారు. మరి ఆరోగ్యం(Boiled egg vs Omelette ) విషయంలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం!
1. బాయిల్డ్ ఎగ్: మీరు బరువు తగ్గాలి అనుకుంటే కళ్ళు మూసుకుని బాయిల్డ్ ఎగ్ తినేయండి. ఎందుకంటే ఇందులో ఆయిల్ గానీ, వెన్న గానీ ఉండదు. ఒక మీడియం సైజు బాయిల్డ్ ఎగ్ లో కేవలం 78 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. పచ్చసొన తీసేసి తింటే ఇంకా తక్కువ క్యాలరీలు వస్తాయి.
2. ఆమ్లెట్: ఆమ్లెట్ అంటేనే అందులో నూనె, ఉప్పు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి.. అబ్బో ఆ రుచే వేరు. కానీ ఆమ్లెట్ వేయడానికి వాడే నూనె లేదా నెయ్యి వల్ల క్యాలరీల సంఖ్య 90 నుండి 120 కి పెరిగిపోతుంది. మీరు బయట బండి మీద ఆమ్లెట్ తింటే అందులో వాడే ఆయిల్ వల్ల కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది.
3. పోషకాలు దేనిలో ఎక్కువ?
నిజానికి ఒక గుడ్డులో ఉండే ప్రోటీన్ (సుమారు 6 గ్రాములు) ఉడకబెట్టినా, ఆమ్లెట్ వేసినా పెద్దగా మారదు. కానీ, గుడ్డును ఎక్కువ సేపు వేడి చేయడం వల్ల అందులోని కొన్ని విటమిన్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో బాయిల్డ్ ఎగ్ ఒక అడుగు ముందే ఉంటుంది.
ఫైనల్ గా ఏది బెస్ట్?
బరువు తగ్గాలి, మజిల్ రావాలి అనుకునే వారికి బాయిల్డ్ ఎగ్ బెస్ట్ ఆప్షన్. టేస్ట్ కావాలి, క్యాలరీలు పెరిగినా పర్లేదు అనుకునే వారికి ఆమ్లెట్ ఓకే.
ఒకవేళ ఆమ్లెట్ వేసుకోవాలి అనుకుంటే నూనె బదులు తక్కువ వెన్న వాడండి లేదంటే ఆయిల్ లెస్ పద్ధతిలో ట్రై చేయండి. ఉల్లిపాయలు, పాలకూర లాంటి కూరగాయలు జోడిస్తే మరింత హెల్దీగా ఉంటుంది.
