Sperm count : చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగని వారు మనలో చాలా మంది ఉన్నారు. అయితే మీరు రోజూ తినే ఆ చికెన్ మీ పౌరుషాన్ని దెబ్బతీస్తుందని మీకు తెలుసా? ముఖ్యంగా మగవారిలో సంతానలేమి సమస్యలకు, వీర్యకణాల కౌంట్ (Sperm count)పడిపోవడానికి మనం తినే బ్రాయిలర్ చికెన్ ఒక ప్రధాన కారణమని తాజా హెల్త్ రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి.
కోడి మాంసం సహజంగా ప్రోటీన్ ఇస్తుంది. కానీ, సమస్య అంతా కోడి పెరిగే విధానంలోనే ఉంది. బ్రాయిలర్ కోళ్లు 40 రోజుల్లోనే భారీగా పెరగడం కోసం వాటికి ఈస్ట్రోజెన్ (Estrogen) వంటి హార్మోన్లను ఇస్తారు. ఈ ఈస్ట్రోజెన్ అనేది ఆడవారిలో ఉండే హార్మోన్.
మగవారు ఈ చికెన్ ఎక్కువగా తిన్నప్పుడు, వారి శరీరంలో ఫీమేల్ హార్మోన్ల ప్రభావం పెరుగుతుంది. దీనివల్ల మగతనాన్ని ఇచ్చే టెస్టోస్టెరాన్ (Testosterone) హార్మోన్ తగ్గిపోతుంది. ఫలితంగా వీర్యం కౌంట్ తగ్గడమే కాకుండా, నాణ్యత కూడా దెబ్బతింటుంది.
కోళ్లకు రోగాలు రాకుండా విపరీతంగా యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇవి మన శరీరంలోకి చేరినప్పుడు వీర్యకణాల ఉత్పత్తిని (Spermatogenesis) అడ్డుకుంటాయి. ఈ చికెన్ అతిగా తినడం వల్ల మగవారిలో స్పర్మ్ కణాల కదలిక (Motility) తగ్గిపోతుంది.
బ్రాయిలర్ చికెన్ వల్ల వచ్చే చెడు కొవ్వు కారణంగా స్థూలకాయం వస్తుంది. ఒంట్లో కొవ్వు పెరిగితే టెస్టోస్టెరాన్ ఆటోమేటిక్‌గా పడిపోతుంది.
మరి మగవారు చికెన్ మానేయాలా అంటే అవసరం లేదు. వీలైనంత వరకు నాటు కోడి మాంసానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇందులో హార్మోన్ల ముప్పు ఉండదు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చికెన్ తినడం అలవాటు చేసుకోండి. కోడి శరీరంలో హార్మోన్లు, మందుల ప్రభావం ఎక్కువగా కాలేయం (Liver) మీద ఉంటుంది. కాబట్టి కోడి లివర్ తినడం తగ్గించండి.
