Union Budget 2026: కేంద్ర బడ్జెట్ రాబోతుంది అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. ఫిబ్రవరి 01వ తేదీ ఆదివారం రోజున మోదీ సర్కార్ బడ్జెట్(Union Budget 2026) ప్రవేశపెట్టబోతుంది. బడ్జెట్ అంటే కేవలం అంకెలే కాదు, మన వంటింటి ఖర్చులు, పిల్లల చదువులు, మనం కట్టే పన్నుల భవిష్యత్తు. ఈ ఏడాది బడ్జెట్‌లో మధ్యతరగతి వర్గాలకు చేకూరే 5 ప్రధాన లాభాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
కేంద్ర బడ్జెట్ అంటేనే మధ్యతరగతి వారితో పాటుగా అందరూ ఎదురుచూసేది ఇన్కమ్ టాక్స్ స్లాబ్స్ గురించే. ఆదాయపు పన్నులో భారీ ఊరట ఏమైనా ఉంటుందా అనే ఆశే ఎక్కువగా ఉంటుంది. మోదీ సర్కార్ స్టాండర్డ్ డిడక్షన్ పెంచే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) పెంచితే జీతగాళ్ల చేతిలో నెలకు మరికొంత డబ్బు మిగులుతుంది. రూ. 7 లక్షల నుండి రూ.10 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి పన్ను భారం తగ్గితే, అది నేరుగా వారి సేవింగ్స్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఇక హోమ్ లోన్ వడ్డీపై ఇచ్చే మినహాయింపు (Section 24b) పరిమితిని రూ.2 లక్షల నుండి పెంచితే, లోన్ తీసుకున్న వారికి నెలకు కట్టే EMI భారం తగ్గుతుంది. మొదటిసారి ఇల్లు కొనేవారికి అదనపు సబ్సిడీలు వచ్చే అవకాశం ఉంటుంది.
పీఎం కిసాన్ నగదు పెంపు
పీఎం కిసాన్ నగదును పెంచుతారన్న చర్చ జోరుగా నడుస్తోంది. పీఎం కిసాన్ నిధిని ఏడాదికి రూ.6,000 నుండి రూ. 9,000 కి పెంచే అవకాశం ఉంది. ఇది నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది.
బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల వస్తువుల ధరలు మారుతుంటాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గుతాయి. వంటనూనెలు లేదా పప్పు దినుసుల దిగుమతిపై పన్నులు తగ్గిస్తే సామాన్యుడి నెలసరి బడ్జెట్ అదుపులోకి వస్తుంది.
మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహిళా సమ్మాన్ వంటి పథకాలపై వడ్డీ రేట్లు పెంచితే, ఇంట్లో ఉండే మహిళలు తమ చిన్న మొత్తాల పొదుపుపై ఎక్కువ లాభం పొందవచ్చు.
Also Read :
- టెన్షన్ వద్దు మావా..CIBIL Score సున్నా ఉన్నా..Loan ఇచ్చే 3 Best Apps ఇవే!
- 160 CRPC అంటే ఏంటి? KTRకు ఈ సెక్షన్ కింద నోటీసులు ఎందుకు ఇచ్చారు?
- Today Gold Rate in Hyderabad : బంగారం కొనాలా? అయితే ఒక్క నిమిషం.. ఈరోజు రేట్లు చూస్తే షాక్ అవుతారు!
