చాందిని పెళ్లిచేసుకుందామంది..! సాయికిరణ్ చంపేశాడు..!

చాందిని జైన్. సాయికిరణ్. గత తొమ్మిదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. కానీ…గతకొంత కాలంగా చాందిని ప్రవర్తన తేడా వచ్చిందట. అది సాయికిరణ్ కు నచ్చలేదు. ఓకే…ఇలా కాదు. బ్రేకప్ చేసుకుందాం అనుకున్నాడు. దానికి చాందిని ఒప్పుకోలేదు. లేదులేదు. లవ్ కంటిన్యూ చేయాల్సిందే. అంతేకాదు. పెళ్లి కూడా చేసుకోవాలి…అని పట్టుపట్టింది. సాయికిరణ్ చాలా చెప్పి చూశాడు. అయినా విన్లేదు చాందిని. ఇదే టైమ్ లో… అనుకున్నట్టే…రెగ్యులర్ గా కలుసుకునే అమీన్ పూర్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కూడా సేమ్ సీన్. చాందిని పెళ్లి చేసుకుందామంది. లేదులేదు..ఇంకా లైఫ్ లో సెటిలవ్వాలి. ఇప్పుడే పెళ్లేంటీ..? దానికింకా టైముందీ అని..సాయికిరణ్ వాధించాడు. అయినా..చాందిని విన్లేదు. సాయికిరణ్ కి కోపమొచ్చింది….చాందినినీ చంపేశాడు.సింపుల్ గా చెప్పాలంటే…ఇదీ ఇంటర్ విద్యార్థితి చాందిని జైన్ హత్య కేసు స్టోరీ.

 

మొత్తానికి చాందిని కేసులో క్లారిటీ వచ్చింది. మిస్టరీ వీడింది. చాందినిని ఆమె ఫ్రెండ్ సాయికిరణే…చంపేశాడని క్లారిటీకి వచ్చారు పోలీసులు. సాయికిరణ్ ప్రస్తుతం  మియాపూర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కొంతకాలంగా చాందినితో సాయికిరణ్ కు పరిచయం ఉన్నట్లు చెబుతున్నారు. 2015 నుంచి చాందినికి సాయికిరణ్ తో లవ్ ఎఫైర్ ఉన్నట్టు తెలుస్తంది. అయితే రిలేషన్ ని బ్రేకప్ చేసుకుందామని సాయికిరణ్ చాందినీతో అన్నట్టు సమాచారం. చాందిని మాత్రం లవ్ కంటిన్యూ చేద్దామని, పెళ్లి కూడా చేసుకోవాలని సాయికిరణ్ కు గట్టిగా చెప్పినట్టు సమాచారం.

LEAVE A REPLY