టెక్నికల్ ఫాల్ట్ : చంద్రయాన్-2 వాయిదా

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం అనూహ్యంగా వాయిదా పడింది. సాంకేతిక లోపంతో పదేళ్లుగా పడ్డ కష్టానికి బ్రేకులు పడ్డాయి. ప్రయోగానికి 56 నిమిషాల 24 సెకన్ల ముందు అంటే గంటా 55 నిమిషాల ముందు కౌంట్ డౌన్ ప్రక్రియ అర్థాంతరంగా ఆగిపోయింది. ఆదివారం ఉదయం 6 గంటల 51 నిమిషాలకు ఇస్రో ఛైర్మన డాక్టర్ శివన్ ఆధ్వర్యంలో చంద్రయాన్-2కు కౌంట్ డౌన్ మొదలైంది. సోమవారం తెల్లవారు జామున 2 గంటల 51 నిమిషాలకు GSLV-3, మార్క్-1 రాకెట్ నింగిలోకి వెళ్లాల్సింది. కానీ టెక్నికల్ రీజన్స్ తో అర్థాంతరంగా ఆపేశారు ఇస్రో సైంటిస్టులు. రాకెట్ లో అత్యంత కీలక దశగా చెప్పుకునే క్రయోజనిక్ ఇంజిన్ బ్యాటరీలు ఛార్జ్ కాకపోవడం ఒక లోపమైతే… అదే క్రయోజనిక్ లో ఉండే గ్యాస్ బాటిల్ లీకేజీ కావడం మరో లోపం. చివరి క్షణంలో సాంకేతిక లోపాల్ని గమనించిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతిష్టాత్మక ప్రయోగం గతంలో ఎప్పుడూ ఇలా వాయిదాపడిన దాఖలాలు లేవు. పదేళ్ల కష్టం, నిరంతర శ్రమ ఎందుకు వృధా అయిందన్న కోణంలో ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. రూ. వెయ్యి కోట్లతో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు కావడంతో ఇస్రో సైంటిస్టులు రిస్క్ తీస్కోలేదు. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యుంటే భారత్… అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా చరిత్రకెక్కేది. చంద్రయాన్-2 ప్రయోగం సెప్టెంబర్ 9న మళ్లీ నిర్వహించే అవకాశముందని సమాచారం.

ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించేందుకు ‘షార్’కు చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించిన లాంచ్ ప్యాడ్ వద్దకు చేరుకుని GSLV మార్క్-3 M1 రాకెట్ ను సందర్శించారు. ఆ తర్వాత షార్ లో సుమారు రూ.650 కోట్లతో నిర్మించిన రెండో వెహికిల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ ను లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు.

LEAVE A REPLY