Anasuya : టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే కాకుండా, టీవీ డిబేట్లలో తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ ఆమె పోలీసులకు తన ఫిర్యాదు తెలిపారు.
ఈ మేరకు కాంగ్రెస్ నాయకురాలు బొజ్జ సంధ్యారెడ్డితో పాటు మొత్తం 73 మందిపై పోలీసులు FIR నమోదు చేశారు. తనపై వేధింపులు మొదలయ్యాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన కామెంట్లతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు ఉద్దేశపూర్వకంగా ఈ ఇష్యూని పెద్దది చేశాయని, టీవీ డిబేట్ల వల్ల తనకు లైంగిక వేధింపులతో పాటు ప్రాణహాని బెదిరింపులు కూడా వస్తున్నాయని అనసూయ తెలిపారు.
