Anchor Rashmi Gautam : నా క్యారెక్టర్‌పై పడి ఏడవకండి.. ట్రోలర్ల తాట తీసిన యాంకర్ రష్మీ!

Anchor Rashmi Gautam

Anchor Rashmi Gautam :  ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె తన వ్యక్తిగత విషయాల కంటే, సామాజిక అంశంపై చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారితీసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత భారత్‌లో కొందరు ఆందోళనలు చేయడంపై రష్మీ తీవ్రంగా స్పందించారు. “అంతగా ఆందోళన చేసే వాళ్లను ఇరాన్‌కే పంపించేయండి” అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట మంటలు రేపుతోంది.

రష్మీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఖమేనీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆమె క్యారెక్టర్‌ను కించపరుస్తూ కొందరు నెటిజన్లు అసభ్యకరమైన పోస్టులు చేశారు. “ఎంతో మందితో ఎఫైర్స్ పెట్టుకుని.. పతివ్రతలా నాటకాలు ఆడుతున్నావు” అంటూ ఒక నెటిజన్ చేసిన కామెంట్ రష్మీకి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీనిపై రష్మీ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు.

తన పర్సనల్ లైఫ్ గురించి ఏవైనా ఆధారాలు ఉంటే ధైర్యంగా బయటపెట్టాలని రష్మీ సవాల్ విసిరారు. “నాకు రిలేషన్స్ ఉన్నా.. లేకపోయినా నన్ను వేధించే హక్కు ఎవరికీ లేదు. నేను పెళ్లి చేసుకునే వరకు ఎంతమందితో తిరిగినా అది నా ఇష్టం.. అది మీ సమస్య కాదు” అంటూ నెటిజన్లకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తన క్యారెక్టర్‌పై తప్పుడు ప్రచారం చేసే వారికి అస్సలు భయపడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.