BIG BREAKING : తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కడం ఇప్పుడు ఇటు సినీ ఇండస్ట్రీలో, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విజయ్ నుండి విడిపోవాలని నిర్ణయించుకున్న సంగీత, ఈరోజు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో అధికారికంగా విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం, కేసు విచారణను మార్చి 20వ తేదీకి ఖరారు చేసింది. ఆ రోజున కోర్టు ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరపనుంది.
ఐదేళ్ల కిందటే మేం మానసికంగా విడిపోయాం. విజయ్‌కి సినీ నటితో వివాహేతర సంబంధం ఉంది. విజయ్ ఆ నటితో విదేశాలకు, పార్టీలకు వెళ్తారు. విజయ్ వేధింపులు కొనసాగితే ఆ నటి పేరు బయటపెడతా. విజయ్ వివాహేతర సంబంధం ఒక ద్రోహమని -సంగీత తెలిపారు.

గత కొంతకాలంగా విజయ్, సంగీత మధ్య విభేదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక ప్రముఖ నటితో విజయ్‌కు ఉన్న సంబంధమే ఈ విడాకుల నిర్ణయానికి ప్రధాన కారణమని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. దాదాపు రెండేళ్లుగా వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారని, రాజీ ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే సంగీత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
1999లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్-సంగీత జంటకు ఇద్దరు పిల్లలు (కుమారుడు జోసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా) ఉన్నారు. సుమారు 26 ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఇప్పుడు విడిపోతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
విజయ్ తన సొంత పార్టీ TVK ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు.ఈ క్రమంలో ఆయన భార్య విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం, పైగా పరాయి స్త్రీతో సంబంధం ఉందనే ఆరోపణలు రావడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపుతుందో అన్న చర్చ మొదలైంది.
ఇటీవలే విజయ్‌పై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు సంచలన ఆరోపణలు చేశారు. ఓ హీరోయిన్‌తో విజయ్‌కు ఎఫైర్ ఉందంటూ కామెంట్స్ చేశారు.
