Nainika: ఒక్క రాత్రికి రేటు ఎంతంటే..నైనిక షాకింగ్ కామెంట్స్

nainika

తెలుగు బిగ్ బాస్ ఫేం నైనిక. నైనిక ప్రస్థానం ‘ఢీ’ డ్యాన్స్ షోతో మొదలైంది. ఒక డ్యాన్సర్‌గా ఆమె తన అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘ఢీ’ షోలో ఆమె డ్యాన్స్ నైపుణ్యం, గ్రేస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ షోలో ఆమెను ‘పొట్టి పిల్ల’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు. డ్యాన్సర్‌గా ఆమె సంపాదించుకున్న గుర్తింపుతో నటన వైపు అడుగులు వేశారు. ‘పిల్లా పడేసావే’ వంటి టీవీ సీరియల్స్‌లో నటించి నటిగా కూడా ప్రశంసలు అందుకున్నారు.

డ్యాన్సర్, నటిగా సాధించిన ఫేమ్ నైనికకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ప్రవేశించే అవకాశాన్ని కల్పించింది. హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె మొదట్లో చాలా ఎనర్జిటిక్‌గా, చురుగ్గా కనిపించారు. ముఖ్యంగా ‘క్లాన్ లీడర్’గా ఆమె ఆడిన గేమ్ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది. అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చే ఏకైక కంటెస్టెంట్‌గా ఆమె కనిపించారు. అయితే, కొన్ని వారాల తర్వాత ఆమె ఆటలో వేగం తగ్గిపోయింది. దీంతో ఆమె కొన్ని వారాలకే ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ లో ఆమె ప్రయాణం తక్కువ కాలమే అయినా, ఆమె తనదైన ముద్ర వేశారు.

తాజాగా నైనిక జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన ఘటనలన అభిమానులతో పంచుకున్నారు. ఒకర్ని గాఢంగా ప్రేమించానని అయితే అతను నన్ను మోసం చేశాడని తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. నా కెరీర్‌‌లో కాస్టింగ్ కౌచ్‌ను కూడా ఫేస్ చేశానని చెప్పుకొచ్చింది. నాకు తెలిసిన వ్యక్తి ఫోన్ చేసి మీ ఫొటోలు అసభ్యకరంగా బయటకు వెళ్తున్నాయని, ఫొటోతో పాటు రేట్ కూడా ఫిక్స్ చేసి పెడుతున్నారని తెలిపారు. ఇది విని నేను షాక్ అయ్యానని , నా ప్రమేయం లేకండా ఇంత జరుగుతుందా అని ఆశ్చర్యపోయానని నైనిక వెల్లడించింది. ఇలాంటి వాళ్లు చిన్న పిల్లలను, కుక్కలను కూడా వదలరని నైనిక కాస్తా ఘాటుగానే మాట్లాడింది. ప్రస్తుతం నైనిక మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి.

credit: Shiva studios