Bigg Boss : బిగ్బాస్కు బిగ్ షాక్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్!

biggboss

Bigg Boss :మా టీవీ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోకు బిగ్ షాక్ తగిలింది. ఆ షో పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గజ్వేల్ కు చెందిన కమ్మరి. శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్.. ఈ షో  సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు.

బిగ్ బాస్ షో కు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదని,కుటుంబ విలువలు పాటించని వారిని బిగ్ బాస్ టీం ఎంచుకుందని తమ ఫిర్యాదులో తెలిపారు. సమాజం సిగ్గు పడే విధంగా బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారని నిర్వాహకులపై మండిపడ్డారు.వెంటనే బిగ్ బాస్ షో ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బిగ్ బాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలకి కోరారు.

లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తాముని వారు హెచ్చరించారు. కర్ణాటకలో చేసిన విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చేయాలని తమ ఫిర్యాదులో వెల్లడించారు. నటుడు నాగార్జున సమాజానికి ఉపయోగ పడే కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.
దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని ప్రశ్నించారు.