BIGG BOSS 9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో మళ్లీ హీట్ పెరిగిపోయింది. కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో గేమ్ రణరంగంగా మారిపోయిందంటే నమ్మదగ్గ విషయమే! ఈసారి ఎవరో కాదు… అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దివ్వడ (దివ్వల) మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, నటి ఆయేషా జీనథ్, ఇంకా గౌరవ్ గుప్తా గారు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు!
ఇంతమంది కొత్త కంటెస్టెంట్స్ రావడంతో హౌస్‌లో ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా మారిపోయాయి. కానీ డ్రామా ఎక్కువగా క్రియేట్ చేసింది దివ్వల మాధురి. నేటి ప్రమోలో చూస్తే, కళ్యాణ్‌తో చిన్న మాట పెద్ద గొడవగా మారిపోయింది.
కళ్యాణ్ మధురిని మర్యాదగా “రండి కూర్చోండి” అని పిలవగానే, మాధురి ఒక్కసారిగా “కూర్చోపోతే ఊరుకుంటారా?” అంటూ వెటకారంగా స్పందించింది. అంతే— హౌస్ మొత్తం టెన్షన్ మోడ్! దివ్య, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కూడా ఆ సీన్‌లో ఉన్నా, మాటల తూటాలు మధురి నుంచి ఆగలేదు.
అంతలో కళ్యాణ్ “ఇలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది” అన్నాడోచో, మాధురి మరింత రెచ్చిపోయింది. దివ్య కూడా అర్ధం చేసుకుందామనగా, “నా టీమ్‌లో నేనొక్కడినేనా?” అంటూ మాధురి దివ్యపైనే ఎగిరిపడింది. చివరికి గొడవ పెరిగి, మాధురి కన్నీళ్లు పెట్టుకునే స్థాయికి వెళ్లిపోయింది. కళ్యాణ్ పక్కవారితో “ఇప్పుడే ఏడుస్తుందే!” అంటూ మాట్లాడుకోగా… బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రం షాక్ అయ్యారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ఈ డ్రామా తర్వాత మాధురి, కళ్యాణ్ మధ్య సంబంధం ఎలా ఉండబోతుంది? మిగతా కంటెస్టెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది. మరి చూడాలి.