Raju Weds Rambai : ఎవడయ్యా వీడు..మంగపతికి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు!

Chaitanya Jonnalagadda

Raju Weds Rambai – క్లైమాక్స్ చూసినపుడు డైరెక్టర్ కి ఏమైనా పిచ్చనా ఇలా పెట్టాడు అనిపిస్తుంది కాని అది నిజంగా జరిగిన స్టోరీ అని తెలిసాక చాలా బాధనిపిస్తుంది. చిచ్చీ ఇలాంటి తండ్రి కూడా ఉంటాడా, కనిపిస్తే చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. తెలంగాణ గ్రామంలో ఒక జరిగిన ఒక హార్ట్ హిట్టింగ్ ఎమోషనల్ ప్రేమ కథ. స్టార్టింగ్ స్లో గా మొదలయిన హీరోయిన్ లవ్ ఒప్పుకున్నాక ఆ విషయం వాళ్ళ అయ్యకు తెలిసాక స్పీడ్ అందుకుంటుంది. సెకండాఫ్ లో కొన్ని బలమైన సీన్లు, కొన్ని సాగతీత సీన్లతో వెళ్ళిన క్లైమాక్స్ ట్విస్ట్ తో సినిమా ఎమోషనల్ గా బాగా అనిపిస్తుంది.

రాజుగా అఖిల్ రాజ్ యాక్టింగ్ ఇచ్చిపడేసాడు. బ్యాండ్ కొట్టే పల్లెటూరు కుర్రోడుగా, పిచ్చిగా ప్రేమించే ప్రేమికుడిగా బాగా నటించాడు. పాత్రలో లీనమైపోయాడు. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో గోదావరి అమ్మాయిగా బాగా నటించే తేజస్వి ఈ పల్లెటూరు ప్రేమకథలో తెలంగాణ అమ్మాయిగా తన లుక్స్, నటన, ఎక్స్ప్రెషన్స్ తో న్యాచురాలిటీ తీసుకువచ్చింది. లవ్ స్టోరీస్ లో హీరోయిన్ ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది. హీరోయిన్ యాక్టింగ్ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది.

రాంబాయి రాజుగాడికే కాదు సినిమా చూసిన అందరికి నచ్చుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ తండ్రిగా చేసిన చైతన్య జొన్నలగడ్డ(Actor Chaitanya Jonnalagadda). సిద్ధూ జొన్నలగడ్డకి బ్రదర్ అంట. క్యారెక్టర్ అయితే కోర్టు సినిమా మంగపతికి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. బాగా యాక్ట్ చేసాడు కాని ఆ క్యారెక్టర్ కి ఇచ్చిన హైప్ కి ఇంకా బలమైన సీన్లు పడాలి. హీరో తండ్రిగా శివాజీరాజా చాలా గ్యాప్ తర్వాత వచ్చిన మంచి పాత్రతో వచ్చాడు. తల్లిగా అనితాచౌదరి నాకైతే సెట్ కాలేదు అనిపించింది. డబ్బింగ్ కూడా కుదరలేదు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా బాగా చేసారు.

సురేష్ బొబ్బిలి మ్యూజిక్ సినిమాకి తగ్గట్టు బాగుంది. ఇంకొన్ని మంచి లవ్ సాంగ్స్ ఇచ్చుంటే బాగుండేది. డైరెక్టర్ సాయిలు కంపాటి రియల్ గా జరిగిన సెన్సిబుల్ టాపిక్ ను నిజాయతీగా తెరపైకి తీసుకువచ్చాడు. వాళ్ళ ప్రేమలోని నిజాయితీని బాగా చూపించాడు. డైరెక్టర్ కొన్ని సీన్లును,ఎమోషన్ ను, కాన్ఫ్లిక్ట్ ను ఇంకొంచెం బాగా తీసుంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది. విరాటపర్వం డైరెక్టర్ వేణు ఉడుగుల నిర్మించిన చిత్రాన్ని ఈటీవీ విన్, బన్నీవాసు, వంశి నందిపాటి కలసి మరో మంచి చిత్రాన్ని మనకి అందించారు. కొన్ని డైరెక్షన్ మిస్టేక్స్ మినహాయిస్తే ప్రేమకథా సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కర్ని రాజు వెడ్స్ రాంబాయిల స్వచ్ఛమైన ప్రేమకథ నచ్చుతుంది, మనసుల్ని కదిలిస్తుంది.

credits ; Ganesh Saladi