GHMC : హీరోలు నాగార్జున, వెంకటేష్‌కు బిగ్ షాక్ తగిలింది. వీరికి చెందిన అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు..నోటీసులు జారీ చేశారు GHMC అధికారులు. స్టూడియోల యాజమాన్యాలు తమ వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపిస్తూ, ట్రేడ్ లైసెన్స్ ఫీజు, ఇతర పన్నులను భారీగా ఎగవేస్తున్నారని అధికారులు గుర్తించి నోటీసులు పంపించారు.
రూ. 11. 52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా.. అన్నపూర్ణ స్టూడియో లక్షా 92 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ రూ. 49వేలు మాత్రమే చెల్లిస్తుందని, రామానాయుడు స్టూడియోస్ 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ రూ. 1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ. 1900 మాత్రమే చెల్లిస్తు్ందని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అని హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారుల ఈ రెండు సంస్థలకు నోటీసులు ఇచ్చారు.
వ్యాపారాలు తమ పరిధిలో కార్యకలాపాలు నిర్వహించడానికి GHMCఅనుమతిని ఇస్తాయి. ఈ అనుమతిని పొందినందుకు, దానిని ఏటా రెన్యూవల్ చేసుకోవడానికి వ్యాపారాలు చెల్లించే రుసుమే ఈ ట్రేడ్ లైసెన్స్ ఫీజు. వ్యాపారం చట్టబద్ధంగా నడుస్తోందని, ప్రజారోగ్యం, భద్రతా ప్రమాణాలను పాటిస్తోందని ధృవీకరించడానికి ఈ లైసెన్స్ ఉపయోగపడుతుంది.
సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక వ్యాపారం నడుపుతున్నందుకు గాను ప్రతి సంవత్సరం చెల్లించే రెంట్ లాంటిది. మీరు ఏ వ్యాపారం చేయాలన్నా, అది చట్టబద్ధంగా ఉండాలి. దానికి స్థానిక సంస్థల నుంచి ట్రేడ్ లైసెన్స్ అనే అనుమతి పత్రం తీసుకోవాలి. ఈ ఫీజు ద్వారా వచ్చిన డబ్బును మున్సిపాలిటీలు ప్రాంత అభివృద్ధికి ఉపయోగిస్తాయి.
