Jabardasth Yodha : మరో ‘సౌందర్య’లా ఉందే.. జబర్దస్త్ పిల్ల వీడియోలు పిచ్చ పిచ్చగా వైరల్!

Jabardasth Yodha

Jabardasth Yodha : తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించిన ‘జబర్దస్త్’ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. అందులో తన ముద్దు ముద్దు మాటలతో, అదిరిపోయే కామెడీ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన యోధ అందరికీ గుర్తుండే ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరపై, బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన ఈ చిన్నది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.

తన తండ్రి చందుతో కలిసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన యోధ, అందులో రకరకాల వీడియోలు చేస్తూ అలరిస్తోంది. ముఖ్యంగా మహేష్‌తో కలిసి ఆమె చేస్తున్న వీడియో సాంగ్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చిన్న వయసులోనే అద్భుతమైన హావభావాలు పలికిస్తూ ఆకట్టుకుంటుంది. అప్పట్లో జబర్దస్త్‌లో చూసిన చిన్న పిల్ల, అప్పుడే ఇంత పెద్దదైపోయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం యోధ వీడియో సాంగ్స్ చూస్తుంటే ఆమెలో హీరోయిన్ కళ ఉట్టిపడుతోందని అభిప్రాయపడుతున్నారు. ఆమెను చూస్తుంటే అలనాటి నటి ‘సౌందర్య’ గుర్తుకు వస్తోందని, త్వరలోనే యోధ వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మంచి లుక్స్, నటనపై పట్టు ఉన్న యోధ.. భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ కావడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.