Dileep : మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన 2017 నాటి నటి లైంగిక దాడి కేసులో ప్రముఖ నటుడు దిలీప్‌కు కేరళ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణల నుంచి దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ఈ కేసుకు సంబంధించిన విచారణ సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. నటుడు దిలీప్‌పై నేరం రుజువు చేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ, దిలీప్‌ను అన్ని ఆరోపణల నుంచి విముక్తి చేస్తూ కేరళ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
2017లో ఒక ప్రముఖ మలయాళ నటిని కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించిన కేసులో దిలీప్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో దిలీప్‌ను కొంతకాలం అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. ఈ సంఘటన మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసింది.
అయితే, సోమవారం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో దిలీప్‌కు ఈ కేసులో పూర్తిగా ఊరట లభించినట్లయింది. ఈ తీర్పుపై దిలీప్ తరఫు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. అయితే అతనిపై కేసు పెట్టింది ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వికీపీడియాలో ఉన్నసమాచారం ప్రకారం.. 2017 ఫిబ్రవరి 17న నటి భావన కిడ్నాప్, లైంగిక దాడికి గురైన సంఘటనకు సంబంధించి 2017 జూన్ 28న కేరళ పోలీసులు దిలీప్‌ను ప్రశ్నించారు. సుదీర్ఘ విచారణ అనంతరం, ఈ కేసులో కుట్రకు పాల్పడిన ఆరోపణలపై 2017 జూలై 10న దిలీప్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ తరువాత, కోర్టు ఆయనను రిమాండ్‌కు తరలించింది.
ఈ అరెస్ట్ మలయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్ని సృష్టించింది. దిలీప్ అరెస్ట్ తరువాత, వివిధ సినీ సంస్థలు తీవ్ర నిర్ణయాలు తీసుకున్నాయి. పలు సినీ సంస్థలు దిలీప్ సభ్యత్వాన్ని రద్దు చేశాయి. ఈ సంఘటన అప్పట్లో మలయాళ సినిమా వర్గాల్లో ఆయన స్థానాన్ని ప్రశ్నార్థకం చేసింది.
దిలీప్ నటి మంజు వారియర్‌ను 1998 అక్టోబర్ 20 న వివాహం చేసుకున్నారు.ఈ జంటకు 2000లో ఒక కుమార్తె జన్మించింది. 2014జూలై 2014ఈ జంట విడాకుల కోసం దాఖలు చేయగా.. 2015జనవరి 31న మంజూరు చేయబడింది.2016 నవంబర్ 25న నటి కావ్య మాధవన్‌ని దిలీప్ పెళ్లాడాడు.ఈ దంపతులకు 2018లో ఒక కుమార్తె జన్మించింది.
