Mana Shankara Vara Prasad Garu : కథ కావాలి.. కథనం ఉండాలి అనుకుంటే మన శంకరవరప్రసాద్ గారు మీకు నచ్చరు.. నో లాజిక్.. ఓన్లీ వింటేజ్ మెగా మ్యాజిక్ కోసం అయితే మన శంకరవరప్రసాద్ గారు మనసుకి నచ్చేస్తారు..
ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం..అయ్యా అనిల్ రావిపూడి నీకు కోటి దండాలు స్వామి.. ఈ జనరేషన్ దర్శకులను చిరంజీవిని నువ్వు అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేదు..పాతికేళ్లు దాటిపోయింది మెగాస్టార్ ను అలా స్క్రీన్ మీద చూసి.. అప్పుడెప్పుడో నేను స్కూలుకి వెళ్లే టైంలో.. అన్నయ్య సినిమాలో ఇలాంటి కామెడీ టైమింగ్ చూశా.. ఆ తర్వాత ఎన్నో బ్లాక్బస్టర్స్ చిరంజీవి ఇచ్చాడు కానీ.. ఆ కామెడీ మాత్రం రాలేదు.. ఇన్నాళ్లకు ఆ లోటు నువ్వు తీర్చేసావు..
ఫస్టాఫ్ లోనే పైసా వసూల్ అయిపోయింది.. మెగా వింటేజ్ చమక్కులు.. ఆ పంచ్ డైలాగులు.. సెల్ఫ్ సెటైర్లు.. చిరంజీవికి మాత్రమే సాధ్యమైన కొన్ని మోడ్యులేషన్స్.. ఏ ఒక్కటి వదలకుండా స్క్రీన్ మీద దించేశావు.. అందుకే నీకు కోటి దండాలు..
ఇక చిరంజీవి కూడా ఎంత ఆకలి మీద ఉన్నాడో అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది..తనకు కామిక్ క్యారెక్టర్ దొరికితే ఎలా రెచ్చిపోతాడో మరోసారి ప్రూవ్ చేశాడు మెగాస్టార్.. జస్ట్ టైం గ్యాప్ అంతే టైమింగ్ లో అస్సలు గ్యాప్ ఉండదని స్క్రీన్ మీద రఫ్ ఆడించాడు.. ఒక్కొక్క సీనులో చిరంజీవి కామెడీ టైమింగ్ చూస్తుంటే ఘరానా మొగుడు గుర్తొచ్చింది..
ఫస్టాఫ్ అయితే హిలేరియస్.. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కాస్త తగినట్టు అనిపిస్తుంది కానీ చివర్లో సెట్ అయిపోయింది.. వెంకటేష్ వచ్చాక స్క్రీన్ దద్దరిల్లిపోయింది.. నేను ఊహించినంత లేదు కానీ పర్లేదు.. చిన్న చిన్న సీన్స్ కూడా అనిల్ రావిపూడి రాసిన దానికంటే 100 రెట్లు ఇంప్రోవైజ్ చేశాడు చిరు.. సింపుల్ గా చెప్పాలంటే శంకరవరప్రసాద్ గా తన ఆకలి మొత్తం తీర్చేసుకున్నాడు బాస్..
లుక్స్ పరంగా కూడా చిరంజీవి నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాడు.. హుక్ స్టెప్, మెగా విక్టరీ సాంగ్స్ విజువల్ గా అదిరిపోయాయి.. నయనతార కూడా చాలా అందంగా ఉంది.. వెంకటేష్ ఉన్న 20 నిమిషాలు అతికించినట్లు అనిపించింది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది.. ఈ తరం దర్శకులలో ఆడవాళ్ళ సైకాలజీ అనిల్ రావిపూడి కంటే ఎవరికీ బాగా తెలియదు..
సెకండ్ హాఫ్ లో వాళ్లు సైకాలజీ మీద వచ్చే ఒక సీన్ భలే ఉంది.. భీమ్స్ మ్యూజిక్ బాగుంది.. ఓవరాల్ గా మన శంకరవరప్రసాద్ గారు.. బాగున్నారు.. పండక్కి నవ్విస్తారు..!
Credit : Praveen Kumar
