Nara Rohit : మూడు ముళ్ల బంధంతో నారా రోహిత్, శిరీష ఒక్కటయ్యారు.

హీరో నారా రోహిత్, నటి శిరీష వివాహం రాత్రి వైభవంగా జరిగింది.

కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేశ్, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

రోహిత్, శిరీష ప్రతినిధి-2 సినిమాలో జంటగా నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహబంధంతో ఒక్కటయ్యారు.

