Nari Nari Naduma Murari : నవ్వుల సిక్సర్ కొట్టేసిన శర్వా…ఫస్ట్ సీన్ నుంచే హిలేరియసే!

nari nari naduma murari

Nari Nari Naduma Murari : అబ్బా సాయిరాం.. సంక్రాంతి సీజన్ హిలేరియస్‌గా అయిపోయింది.. చివరి బంతికి వచ్చి నవ్వుల సిక్సర్ కొట్టేసింది నారినారి నడుమ మురారి.. ముందు నుంచి అనుకున్నట్లుగానే శర్వానంద్‌కు సంక్రాంతి కలిసొచ్చింది.. సామజవరగమనతో మ్యాజిక్ చేసిన రామ్ అబ్బరాజు అండ్ టీం.. నారినారి నడుమ మురారితో ఆల్‌మోస్ట్ ఆ రేంజ్ రీచ్ అయిపోయారు..

ఫస్టాఫ్ కానీ ఇంకాస్త నవ్వులు పడుంటేనా.. మరో సామజవరగమనా అయ్యేది.. అయినా కూడా ఇందులో కామెడీకి ఢోకా లేదు.. ఫస్ట్ సీన్ నుంచే హిలేరియస్ ఎపిసోడ్స్ వర్కవుట్ అయ్యాయి.. సీనియర్ నరేష్‌ను రామ్ అబ్బరాజు వాడుకుంటున్న తీరు నెక్ట్స్ లెవల్..ఆయన రెండో పెళ్లితో పాటు పర్సనల్ లైఫ్‌పై సెటైర్లు కడుపులు చెక్కలయ్యేలా నవ్వించాయి..

ఫస్టాఫ్‌లో నరేష్ పెళ్లి సీన్.. సత్య కామెడీ సీన్స్‌ బాగా వర్కవుట్ అయ్యాయి.. సెకండాఫ్ అయితే బ్రేకుల్లేని బండిలా దూసుకుపోయింది సినిమా.. రొటీన్ కథనే తీసుకున్నా.. ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు రామ్ అబ్బరాజు.. ముఖ్యంగా డైలాగ్స్ అదిరిపోయాయి.. మాస్ జాతర డైరెక్టర్ భాను భోగవరపుదే ఆ క్రెడిట్.. క్లైమాక్స్ 20 నిమిషాలు కోర్ట్ ఎపిసోడ్ మామూలుగా లేదు.

చివర్లో చిన్న సర్‌ప్రైజ్ క్యామియో కూడా ఉంది.. శర్వానంద్ బాగున్నాడు.. మనోడి కామెడీ టైమింగ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? సాక్షి వైద్య, సంయుక్త మీనన్ ఇద్దరూ బాగున్నారు.. రామ్ అబ్బరాజు మరోసారి మ్యాజిక్ చేసాడు.. సింపుల్ కథతోనే బాగా ఎంటర్‌టైన్ చేసాడు.. ఓరవాల్‌గా నారినారి నడుమ మురారి.. ఈ సంక్రాంతికి ఎంటర్‌టైనింగ్ ఎండ్ కార్డ్..!

Credit  : Praveen kumar