BIG BREAKING : గుంజుకెళ్లారు.. నటి పవిత్ర గౌడ అరెస్ట్

Pavithra Gowda :రేణుకస్వామి హత్య కేసులోకీలక పరిణామం చోటు చేసుకుంది. కన్నడ నటి పవిత్ర గౌడ, నటుడు దర్శన్ ఇతర నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత నటుడు దర్శన్ , నటి పవిత్ర గౌడను పోలీసులు అరెస్టు చేశారు. పవిత్ర గౌడ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా పవిత్ర గౌడ, ఏ2గా దర్శన్ ఉన్నారు. వీరిని ముందుగా ట్రయల్ కోర్టు ముందు హాజరుపరుస్తారు, వైద్య పరీక్షల తర్వాత జైలుకు పంపుతారు. వీరితో పాటుగా పోలీసులు ప్రదూష్ ఎస్ రావు అలియాస్ ప్రదూష్, లక్ష్మణ్ ఎం, నాగరాజు ఆర్ – ముగ్గురు సహ నిందితులను కూడా అరెస్టు చేశారు. ఇతర నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

 

దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుకాస్వామి అభ్యంతరకర సందేశాలు పంపినందుకు, దర్శన్ తన అభిమానుల ద్వారా అతడిని కిడ్నాప్ చేసి, హింసించి, హత్య చేయించారని ఆరోపణలు ఉన్నాయి. 2024 జూన్‌లో రేణుకాస్వామి మృతదేహం బెంగళూరులోని ఒక కాలువలో లభించింది. ఈ కేసులో దర్శన్ గత ఏడాది జూన్ 11న అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు మొదట వైద్య కారణాలతో మధ్యంతర బెయిల్, ఆపై డిసెంబర్ 2024లో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీనిపై పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, ఇప్పుడు బెయిల్ రద్దయ్యింది. నిందతులకు జైలులో ప్రత్యేక సౌకర్యాలు అందించవద్దని కూడా కోర్టు హెచ్చరించింది.