Lavanya : ఫుల్ గా తాగి… రాజ్‌తరుణ్ మాజీ లవర్ లావణ్య హల్‌చల్!

Lavanya

Lavanya : యంగ్ హీరో రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి వార్తల్లో నిలిచారు. మద్యం మత్తులో ఆమె నడిపిన కారు బీభత్సం సృష్టించడమే కాకుండా, స్థానికులతో, పోలీసులతో ఆమె వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లెపల్లి వద్ద లావణ్య ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఒక బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపకుండా లావణ్య అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. అయితే, మల్లెపల్లి గ్రామస్థులు అప్రమత్తమై కారును అడ్డుకున్నారు. బైక్‌ను ఢీకొట్టినందుకు సారీ చెప్పాలని గ్రామస్థులు కోరగా, లావణ్య వారిపైనే విరుచుకుపడ్డారు. మద్యం మత్తులో ఉన్న ఆమె గ్రామస్థులతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు.

ఆ సమయంలో కారులో ఆమెతో పాటు మరో యువకుడు కూడా ఉన్నట్లు సమాచారం. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కూడా లావణ్య కాసేపు గొడవకు దిగారు. అనంతరం ఆమెకు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా డ్రంక్ అండ్ డ్రైవ్ పాజిటివ్ అని తేలింది. కారులో మద్యం సీసాలు ఉన్నట్లు గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేసి, కారును సీజ్ చేశారు. అనంతరం కారును విచారణ నిమిత్తం కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.